Begin typing your search above and press return to search.

అరే.. చక్కనమ్మ పడిపోయిన వేళ

By:  Tupaki Desk   |   12 Aug 2015 12:40 PM IST
అరే.. చక్కనమ్మ పడిపోయిన వేళ
X
చక్కనమ్మ చుక్కలా తయారైంది. చందమామనే మరిపించే వయ్యారం ఒలకబోస్తూ ఠీవిగా వేదికపైకి నడిచొచ్చింది. కానీ పాపం ఊహించని ఘటన. హైహీల్స్‌ కంగారు పెట్టించాయి. కాలు స్లిప్పయ్‌ కిందికి పడిపోయేదే..కొద్దిలో మిస్సయ్యింది. పక్కనే ఉన్న స్టార్లు చటుక్కున స్పందించి ఆదుకోకపోయి ఉంటే ఆ క్షణం ఆ అవమానం ఘోరంగా ఉండేది. అసలు ఈ ఎపిసోడ్‌ అంతా ఎక్కడ? ఎప్పుడు? ఎవరి విషయంలో జరిగింది? అనేగా మీ సందేహం.

అవును మొన్న జరిగిన సైమా 2015 అవార్డు వేడుకల్లో కృతికర్భంద తనకి ప్రకటించిన అవార్డును అందుకోవడానికి చిరునవ్వులు చిందిస్తూ వేదికపైకి ఎక్కింది. వయ్యారంగా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు హఠాత్తుగా లెహంగా తగులుకుని కాలు స్లిప్పయ్యింది. వెంటనే పక్కనే ఉన్న జయం రవి - ఎమీ జాక్సన్‌ - రెజీన వెంటనే స్పందించి కృతిని ఆదుకున్నారు. తిరిగి యథాస్థితికి తెచ్చారు. అదీ ఎపిసోడ్‌.

కోలుకున్నాక కృతి ఏం చెప్పిందో తెలుసా? .. ఎత్తుకి ఎదిగిపోతా, కానీ స్టేజీపై మాత్రం కింద పడతా! అని అమ్మతో ప్రతిసారీ అనేదాన్ని. అమ్మా ఆ సందర్భం రానే వచ్చింది. జెన్నిఫర్‌ లారెన్స్‌ అంతటి స్టార్‌కే ఇది తప్పలేదు.. అంటూ కిసుక్కున నవ్వేసింది. భలే కవర్‌ చేసేసింది కదూ?