Begin typing your search above and press return to search.

ఔను డేటింగ్‌ లో ఉన్నాం.. పెళ్లి వార్తలు పుకార్లే

By:  Tupaki Desk   |   26 Nov 2020 10:30 PM IST
ఔను డేటింగ్‌ లో ఉన్నాం.. పెళ్లి వార్తలు పుకార్లే
X
తెలుగులో హీరోయిన్‌ గా పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కృతి కర్బందా. పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ మూవీలో నటించడంతో పాటు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ వంటి యంగ్‌ హీరోతో కూడా సినిమా చేసిన ఈ అమ్మడికి లక్‌ కలిసి రాకపోవడంతో తెలుగులో మెల్ల మెల్లగా కనుమరుగయ్యింది. ప్రస్తుతం ఇతర భాషల్లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈమె కొన్నాళ్లుగా బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ లో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇన్ని రోజులు ఆ వార్తలపై సైలెంట్‌ గా ఉన్న కృతి ఎట్టకేలకు నోరు తెరిచింది. మీడియాలో వస్తున్న వార్తలు సగం నిజం సగం అబద్దం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.

కృతి కర్బందా మీడియా కామెంట్స్‌ పై స్పందిస్తూ... ఔను పులకిత్‌ తో రిలేషన్‌ షిప్‌ లో అడుగు పెట్టాం. ఇద్దరం కూడా చాలా క్లారిటీగా ముందుకు వెళ్తున్నాం. మా ఇద్దరు అభిప్రాయాలు కూడా కలవడం వల్ల మంచి అవగాహణతో రిలేషన్‌ షిప్‌ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ ఏడాదిలో మా పెళ్లి అంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇద్దరం కూడా కెరీర్‌ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాం. మరో మూడు నాలుగు సంవత్సరాల వరకు కెరీర్‌ కే మా మొదటి ప్రాధాన్యత. కనుక ఈలోపు పెళ్లిపై ఆసక్తి చూపించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. లివింగ్‌ రిలేషన్‌ లో ఉన్న విషయాన్ని కూడా ఆమె కవర్‌ చేసింది. ఆ విషయమై మౌనం వహించింది. కనుక ఇద్దరు కూడా కలిసే ఉంటున్నట్లుగా చెప్పకనే చెప్పింది.