Begin typing your search above and press return to search.
తండ్రితో మెగాబ్యూటీ.. నువ్వెందుకు ఇంత క్యూటీ..? సోషల్ మీడియాలో వైరల్!
By: Tupaki Desk | 24 Feb 2021 2:36 PM ISTచూడగానే ఆకట్టుకునే అందమైన ఆ‘కృతి’ ఆమె సొంతం.. కళ్లతోనే భావాలు పలికించే కెపాసిటీ కూడా ఆ బ్యూటీ అసెట్.. ఈ రెండు అస్త్రాలతో టాలీవుడ్ లోకి ప్రవేశించిన కృతిశెట్టి.. ఇప్పుడు పెద్ద ఉప్పెనే క్రియేట్ చేస్తోంది! తొలి సినిమాతోనే యువత మనసు దోచిన ఈ చిన్నది.. ‘ఉప్పెన’ భారీ సక్సెస్ తో జోరు చూపిస్తోంది.
తొలి సినిమా విజయంతో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న కృతి.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ చిన్ననాటి క్యూట్ ఫొటోను వెతికి పట్టేశారు ప్యాన్స్. మంగళూరుకి చెందిన ఈ బ్యూటీ గతేడాది ‘ఫాదర్స్ డే’ రోజున ఈ ఫొటోను షేర్ చేసింది. అప్పట్లో ఈ అమ్మడి గురించి ఇంకా జనాలకు తెలియలేదు కాబట్టి ఈ ఫొటో వెలుగులోకి రాలేదు. ఇప్పుడు మాత్రం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తండ్రి పక్కన నిలబడి స్మైల్ ఇస్తున్న ఈ అమ్మడు అప్పటి నుంచే క్యూట్ గా ఉంది. దీంతో.. ‘స్వీటీ.. నువ్వెందుకింత క్యూటీ’ అని పాట పాడేస్తున్నారు యూత్. కాగా.. ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న ఈ కన్నడ సోయగం.. భారీ ఆఫర్లతో గాల్లో తేలిపోతోంది. ప్రస్తుతం నాని ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తున్న కృతి.. ఇంకా పేరు పెట్టని సుధీర్ బాబు సినిమాకు కూడా సైన్ చేసింది.