Begin typing your search above and press return to search.

కుర్రాళ్ల గుండెల్లో రొద పెడుతున్న ఉప్పెన గాళ్

By:  Tupaki Desk   |   15 April 2021 4:30 AM GMT
కుర్రాళ్ల గుండెల్లో రొద పెడుతున్న ఉప్పెన గాళ్
X
తొలి ప్ర‌య‌త్న‌మే సంచ‌ల‌నాల‌తో కృతి శెట్టి పేరు మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. `ఉప్పెన` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది ఈ క‌న్న‌డ బ్యూటీ. దాదాపు 100 కోట్ల వ‌సూళ్లు సాధించిన చిత్రంలో క‌థానాయిక‌గా ఈ అమ్మ‌డిని ల‌క్కీ హ్యాండ్ అని భావిస్తోంది ప‌రిశ్ర‌మ‌. సెంటిమెంటు ప్ర‌కారం.. వ‌రుస‌గా అవ‌కాశాలు వెంట‌ప‌డుతున్నాయి.

ఇక త‌న‌దైన అందం న‌ట‌న తో కుర్రాళ్ల గుండెల్ని దోచిన ఈ భామ‌ను వెతుక్కుంటూ ఇటీవ‌ల ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న ని క‌లిసార‌ని క‌థ‌నాలొచ్చాయి. సుధీర్ బాబు -ఇంద్ర‌గంటి కాంబినేష‌న్ మూవీ.. నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్ లోనూ ఈ భామ క‌థానాయిక‌. ప్ర‌స్తుతం ఈ సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు సాగుతున్నాయి. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ స‌ర‌స‌న కృతి క‌థానాయిక‌గా ఎంపికైంది. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదిలా ఉండగానే మ‌రో ఇద్ద‌రు యువ‌హీరోల స‌ర‌స‌నా అవ‌కాశం అందుకుంద‌న్న ప్ర‌చారం ఉంది.

ఇంత స్పీడ్ ఉన్న ఈ భామ ప్ర‌స్తుతం పారితోషికం పెంచేసింద‌ని కోటి డిమాండ్ చేస్తోంద‌ని కూడా ప్ర‌చారం సాగిపోతోంది. ఇదిలా ఉండ‌గానే సోష‌ల్ మీడియాల్లోనూ కృతి భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. నిరంత‌రం ట్రెడిష‌న‌ల్ లుక్ లో ఉన్న‌ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉన్నా కృతికి ఈ వేదిక‌పై భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా కృతి షేర్ చేసిన క్యూట్ ల‌వ్ లీ ఫోటోలు యూత్ లో అంతే వైర‌ల్ గా మారాయి. కాలేజ్ స్కూల్ యూత్ లో ఈ అమ్మ‌డి ఫాలోయింగ్ ఏకంగా స్కైని ట‌చ్ చేస్తోంది.