Begin typing your search above and press return to search.

ఉప్పెన ముద్దుగుమ్మ జోరు కంటిన్యూ

By:  Tupaki Desk   |   16 Dec 2020 2:30 AM GMT
ఉప్పెన ముద్దుగుమ్మ జోరు కంటిన్యూ
X
ఉప్పెన సినిమాలో హీరోయిన్‌ గా నటించిన కృతి శెట్టి పేరు మారు మ్రోగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె నటించిన మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే చేతిలో అరడజను వరకు సినిమాలు పెట్టేసుకుంది. ఇప్పటికే సుధీర్ బాబు కు జోడీగా ఒక సినిమా చేస్తున్న ఈ అమ్మడు ఇటీవలే నానికి జోడీగా శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొదటి సినిమా విడుదల కాకుండా వరుసగా ఇన్ని సినిమాలు చేస్తున్న ఘనత కేవలం ఈ అమ్మడికే దక్కంది అంటున్నారు. తాజాగా కృతి శెట్టి తదుపరి సినిమా అనధికారిక క్లారిటీ వచ్చేసింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్‌ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందబోతున్న అలివేలుమంగ వెంకటరమణ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. గోపీచంద్‌ కు జోడీగా కీర్తి సురేష్‌ అనే వార్తలు వచ్చాయి. మరి ఆమె స్థానంలో ఈమె కనిపించబోతుందా లేదంటే మరో హీరోయిన్‌ గా ఈ సినిమాలో కృతి శెట్టి నటించబోతుందా అనేది చూడాలి. ఇంకా పలు సినిమాల్లో కూడా ఈమె నటించే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2021లో ఈమె నటించిన ఆరు ఏడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటీవలే ఈమె తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాకు కూడా ఓకే అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.