Begin typing your search above and press return to search.

కృతిశెట్టితో సుధీర్ బాబు రొమాన్స్ షురూ..!

By:  Tupaki Desk   |   25 March 2021 9:59 AM GMT
కృతిశెట్టితో సుధీర్ బాబు రొమాన్స్ షురూ..!
X
బాక్సాఫీస్ వద్ద భారీ స‌క్సెస్ సాధించి స్టామినా ప్రూవ్ చేసుకోవాల‌ని చూస్తున్నారు సుధీర్ బాబు. ప‌లు ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైనా.. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ లాంఛనంగా ఇవాళ ప్రారంభమైంది. తన ఫేవరెట్ దర్శకుడితోనే మరోసారి ప్రయాణం మొదలు పెట్టాడీ హీరో.

ఇంద్రగంటి మోహన కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు సుధీర్‌. వీరి కాంబోలో ఇది మూడ‌వ చిత్రం. 2018లో వీరిద్దరూ కలిసి ‘స‌మ్మోహ‌నం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండోసారి ‘వి’ చిత్రంతో సందడి చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కలిశారు ఇంద్రగంటి, సుధీర్ బాబు.

రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో.. సుధీర్ స‌ర‌స‌న ‘ఉప్పెన’ సంచ‌ల‌నం కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇవాళే సెట్స్ లో పాల్గొన్న హీరో.. ఈ మేర‌కు సోస‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటితో మ‌రోసారి అసోసియేట్ అవ‌డం ఆనందంగా ఉంద‌ని ప్ర‌క‌టించాడు. బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.