Begin typing your search above and press return to search.

కృష్ణ చేతుల్లో నిక్క‌రేసిన బుట్ట‌బొమ్మ‌

By:  Tupaki Desk   |   3 May 2022 11:30 AM GMT
కృష్ణ చేతుల్లో నిక్క‌రేసిన బుట్ట‌బొమ్మ‌
X
యంగ్ హీరో నాగ‌శౌర్య‌- షిర్లీ సెటియా జంట‌గా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `కృష్ణ వ్రింద‌ విహారి` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రోమ్-కామ్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ ని తీసుకొచ్చాయి. టీజ‌ర్.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్..నాగ‌శౌర్య -షిర్లీ మ‌ధ్య కెమిస్ర్టీ పోస్ట‌ర్లు యువ‌త‌ని ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా ఈ జంట మ‌రో కొత్త పోస్ట‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చేసారు. ఇందులో నాగ‌శౌర్య‌-షిర్లీ సెటియా రొమాంటిక్ మోడ్ లో క‌నిపిస్తున్నారు. కృష్ణ చేతుల్లో విహారి ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. నిక్క‌రేసిన షిర్టీ బుట్ట‌బొమ్మ‌లా ఉంది. జీన్స్ నిక్క‌రు..ప‌చ్చ రంగు బుట్ట భుజాల‌ జాకెట్..మెడ‌లో జ్యూవెల‌రీ..క‌ళ్ల‌కి అద్దాల ఆహార్యంలో షిర్లీ సెటియా ఆక‌ర్ష‌ణీయంగా ముస్తాబైంది.

ఇక నాగ‌శౌర్య బ్లాక్ ష‌ర్ట్ ..ఫ్యాంట్ లో క‌నిపిస్తున్నాడు. ప్రియురాల్ని చేతుల్లోకి తీసుకుని ముద్దాడ‌బోతున్నాడు. ఈ పోస్ట‌ర్ సాంగ్ షూట్ లో క‌ట్ లా క‌నిపిస్తుంది. నెట్టింట పోస్ట‌ర్ వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం యూనిట్ లిరిక‌ల్ సింగిల్స్ ని ఒక్కోక్క‌టిగా రిలీజ్ చేస్తుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన‌ పాట‌ల‌కు శ్రోత‌ల నుంచి మంచి స్పంద‌న వచ్చింది.

`ఛ‌లో` చిత్రానికి సంగీతం అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకి సంగీతం అందించ‌డం విశేషం. `ఛ‌లో` మ్యూజిక‌ల్ పెద్ద స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో తాజా చిత్రంపైనా మ్యూజిక‌ల్ గా మంచి అంచ‌నాలున్నాయి. ఈ సినిమాపై యంగ్ హీరో చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. `ఛ‌లో` త‌ర్వాత సరైన స‌క్సెస్ ప‌డ‌లేదు. అలాగే యువ మేక‌ర్ కి స‌క్సెస్ కి అనివార్య‌మైన స‌మ‌యం ఇది. అనీష్ కృష్ణ తొలి సినిమా `అలా ఎలా`తో మంచి విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాత తెర‌కెక్కించిన `ల‌వ‌ర్`.. `గాలి సంప‌త్` చిత్రాలు యావ‌రేజ్ గా ఆడాయి. అయితే `కృష్ణ వ్రింద‌ విహారి` రొమాంటిక్ ల‌వ్ స్టోరీ కావ‌డంతో అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఐరా క్రియేష‌న్స్ నిర్మిస్తుంది. మే 20న చిత్రాన్ని థియేట‌ర్లో రిలీజ్ చేస్తున్నారు.