Begin typing your search above and press return to search.

మద్యం సేవించి నటిస్తే తప్పేం లేదు

By:  Tupaki Desk   |   9 Jun 2020 2:30 AM GMT
మద్యం సేవించి నటిస్తే తప్పేం లేదు
X
హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను మెప్పించిన జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. జగపతిబాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఆయనకు మంచి స్టార్‌ డంను తెచ్చి పెడుతున్నాయి. ఒక పాత్ర కోసం జగపతిబాబు చాలా కష్టపడతాడు అంటూ ఆయనతో వర్క్‌ చేసిన దర్శకుడు కృష్ణవంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంత:పురం చిత్రంలో జగపతిబాబు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఆ సినిమాలో జగపతిబాబు నటనకు అంతటి గుర్తింపు.. ప్రశంసలు రావడంకు కారణం మద్యం సేవించి చేయడం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలను కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. సీన్‌ బాగా రావడం కోసం మద్యం సేవించి నటించడంలో తప్పు లేదు. అందుకే తానే స్వయంగా పెగ్గు కలిపి జగపతిబాబుకు ఇచ్చేవాడిని. లిమిట్‌గా తాగి ఆయన షూటింగ్‌లో పాల్గొనేవారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తక పోగా సినిమాకు మంచి స్పందన వచ్చిందని కృష్ణవంశీ అన్నాడు.

అంత:పురం చిత్రంలో జగపతిబాబు నటన ఆయన కెరీర్‌ లోనే బెస్ట్‌ గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ లో జగపతిబాబు చనిపోయే సీన్‌ తెలుగు సినిమా సీన్స్‌ లో ది బెస్ట్‌ సీన్స్‌ ల్లో ఒక్కటిగా నిలిచి పోతుందని విశ్లేషకులు అంటారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ జగపతిబాబు పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్బుతం అంటూ ప్రముఖుల ప్రశంసలు దక్కాయి.