Begin typing your search above and press return to search.

ప్రభాస్ రేంజ్ ఇప్పుడు 75-80%

By:  Tupaki Desk   |   26 March 2017 4:18 PM GMT
ప్రభాస్ రేంజ్ ఇప్పుడు 75-80%
X
రాజమౌళి కుటుంబం అంతా కూడా భోజనం టేబుల్ దగ్గర కూడా బహుశా ఈ నాలుగు సంవత్సరాలు కూడా బాహుబలి గురించే మాట్లాడుకుని ఉంటారు.. ఆ కుటుంబం అంతా ఈ సినిమాపై అంతలా కష్టపడ్డారు.. అంటూ రాజమౌళి ఫ్యామిలీని పొగుడుతూనే.. అసలు ఈ సినిమాలో ప్రభాస్ ఎందుకు చేశాడో చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఓసారి వినుకోండి.

''రాజమౌళి ఈ సినిమాను చేయమని అడగ్గానే ప్రభాస్ ఏమీ ఆలోచించలేదు. అప్పుడు మా తమ్మడు సూర్య నారాయణరాజు కూడా ఉన్నాడు. ఏరా చేస్తావా అని ప్రభాస్ ను అడిగితే.. ప్రభాస్ ఎస్ అన్నాడు. ఎన్ని రోజులు పడుతుంది.. నాకేంటి.. ఏమొస్తుంది.. ఇలాంటివేవి ఆలోచించలేదు. కేవలం రాజమౌళి మీద నమ్మకంతో వెంటనే ఓకె చెప్పాడు. ఈరోజును దాని ఫలితం చూస్తున్నాం'' అంటూ సెలవిచ్చారు కృష్ణంరాజు. అంతేకాదు.. ప్రభాస్ యాక్టింగ్ గురించి కూడా ఆయన ఒక కామెంట్ వేశారు.

''అప్పట్లో నేను నటిస్తున్నప్పుడు.. రియాల్టీకి కాస్త దగ్గరగా చేస్తున్నావ్ అనేవారు నా దర్శకుడు. యాక్టింగ్ అంటే యాక్టింగ్ లా కాకుండా రియాల్టీగా చేయాలంటే.. మాత్రం కష్టమే. అప్పట్లో నాకు నేను ఒక 50% యాక్టర్ అని అనుకునేవాడ్ని. కాని బాహుబలిలో ప్రభాస్ మాత్రం చాలా ఎదిగిపోయాడు. ప్రభాస్ ఇప్పుడు 75-80% రేంజు రియలిస్టిక్ నటుడిగా ఎదిగాడు. రాజమౌళి అలా చేయించుకున్నాడు. అద్భుతం'' అంటూ ముగించారు కృష్ణంరాజు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/