Begin typing your search above and press return to search.

ప్రభాస్ పెళ్లికి పిల్లను వెతుకుతున్నారట..

By:  Tupaki Desk   |   19 Jan 2016 9:02 AM GMT
ప్రభాస్ పెళ్లికి పిల్లను వెతుకుతున్నారట..
X
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ అందగాడి పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంది. 36 దాటినా ఇంకా బ్యాచులర్ గానే ఉన్నాడు ఈ ప్రభాస్. మరి ఈ బాహుబలికి పెళ్లి ఎప్పుడు చేస్తారనే మాటకు చాలాసార్లు మాట దాటేశారు తప్ప సరైన సమాధానం రాలేదు. ఇప్పుడు మాత్రం రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు.

'ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ నాకు మాట ఇచ్చాడు. మేం ఇప్పుడు పెళ్లి కూతురును వెతకడం స్టార్ట్ చేశాం' అని చెప్పారు కృష్ణం రాజు. అంటే ఈ ఏడాదిలో ప్రభాస్ కి పెళ్లి కూతురిని వెతికేసి, ఏడాది చివర్లో పెళ్లి చేసే ఐడియా ఉందని అంటున్నారు. 2016 చివర్లో ప్రభాస్ కి రెండు వేడుకలు ఒకేసారి వచ్చే అవకాశాలున్నాయన్న మాట. బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ తో పాటు, పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా ఓ కొలిక్కి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పటివరకూ యంగ్ రెబల్ స్టార్ పై బోలెడన్ని పుకార్లు హల్ చల్ చేశాయి.

రాజకీయ నాయకులతోను, సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లతోనూ లింకులు అంటగట్టారు చాలామంది. ఇప్పుడు అలాంటి వాటన్నిటికీ.. కృష్ణం రాజు ఇచ్చిన క్లారిటీతో చెక్ పడనుంది. కేవలం పెళ్లి విషయమే కాదు.. మరో విశేషం కూడా పంచుకున్నారు సీనియర్ రెబల్ స్టార్. తన బేనర్ అయిన గోపీకృష్ణా మూవీస్ పై ప్రభాస్ తో ఓ సినిమా చేయనున్నారట కూడా. సాధారణంగా ఈ బ్యానర్ పై తీసే సినిమాలకు కృష్ణం రాజు స్వయంగా దర్శకత్వం వహిస్తుంటారు. ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఆలోచన ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. బహుశా ప్రభాస్ తో నిర్మించే ఈ చిత్రానికి కూడా కృష్ణంరాజు దర్శకత్వం వహించవచ్చు.