Begin typing your search above and press return to search.

నాని నాలుగు కోట్లకు తెగ్గొట్టాడు

By:  Tupaki Desk   |   5 March 2016 11:46 AM IST
నాని నాలుగు కోట్లకు తెగ్గొట్టాడు
X
సినిమాకు మంచి హైప్ వచ్చింది. టాక్ కూడా అదిరిపోయింది. రివ్యూలు ఫుల్ పాజిటివ్ గా వచ్చాయి. అయినా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ‘భలే భలే మగాడివోయ్’తో పోల్చుకుని ఇది ఈజీగా పాతిక కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందేమో అనుకుంటే.. 15 కోట్లకు దగ్గర్లో ఆగిపోయింది. కొన్ని చోట్ల బయ్యర్లకు నష్టం కూడా తప్పట్లేదన్న వార్తలు షాకింగా అనిపిస్తున్నాయి.

ఎంత అన్ సీజన్ అయినప్పటికీ ఇంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ మాత్రం కలెక్షన్లేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ వారం ఒకేసారి నాలుగు సినిమాలు రావడంతో అందులో కళ్యాణ వైభోగమే మంచి టాక్ తెచ్చుకోవడం.. మిగతా మూడు సినిమాలకు కూడా ఓ మోస్తరు టాక్, కలెక్షన్లు ఉండటంతో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పని దాదాపుగా అయిపోయినట్లే అనిపిస్తోంది.

ఐతే థియేట్రికల్ కలెక్షన్లు ఎలా ఉన్నప్పటికీ.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ శాటిలైట్ రైట్స్‌ కు మాత్రం మాంచి డిమాండే ఉందని రుజువైంది. ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఓ ఛానెల్ ఏకంగా రూ.4 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇది నాని సినిమాల్లో హైయెస్ట్ ప్రైస్. ఈ సినిమాకు ఇప్పటికే శాటిలైట్ అయ్యిందని వచ్చిన వార్తలు నిజం కాదు. ఈ మధ్యే డీల్ ఓకే అయ్యింది. సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. దీనికి టీవీలో మంచి రెస్పాన్స్ ఉంటుందని అంచనా వేసి.. ఫ్యాన్సీ రేటు పెట్టి సినిమాను కొనుక్కుంది ఓ ప్రముఖ ఛానెల్.