Begin typing your search above and press return to search.

నాని సగం పని పూర్తి చేసేశాడు

By:  Tupaki Desk   |   15 Feb 2016 5:03 PM IST
నాని సగం పని పూర్తి చేసేశాడు
X
భలే భలే మగాడివోయ్ సినిమాను అమెరికాలో వంద స్క్రీన్లలో రిలీజ్ చేస్తుంటే చాలామంది ఎగతాళి చేశారు. వచ్చే కలెక్షన్లు ఖర్చులకే చెల్లయిపోతాయని ఎద్దేవా చేశారు. కానీ చివరికి ఆ సినిమా ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసి అందరినీ విస్మయానికి గురి చేసింది. సినిమాలో కంటెంట్ ఉండటమే కాదు.. నాని లాంటి అందరి యాక్సెప్టెన్స్ ఉన్న కథానాయకుడు అందులో హీరోగా నటించడం దీనికి బాగా ప్లస్సయింది. యుఎస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గ వినోదం ఇందులో ఉండటం కలిసొచ్చింది. ఆ సినిమా ఫలితాన్ని దృష్టిలో ఉంచుకునే నాని కొత్త సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ను కూడా మంచి ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు.

ఈ సినిమాను ‘భలే భలే మగాడివోయ్’ కంటే కూడా ఎక్కువగా 130 స్క్రీన్లలో రిలీజ్ చేశారు యుఎస్ లో. సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో 14 రీల్స్ సంస్థ సొంతంగా రిలీజ్ చేసింది. అందుకు ఇప్పుడు మంచి ఫలితాన్నే అందుకుంటోంది. ప్రిమియర్స్ నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టికెట్ రేటు అన్నిచోట్లా 12 డాలర్లే పెట్టడం కూడా కలిసొచ్చి సినిమా కోసం బాగానే ఎగబడ్డారు యుఎస్ జనాలు. యుఎస్ థియేటర్లలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ టికెట్ల కోసం జనాలు బారులు తీరిన వీడియోల్ని షేర్ చేస్తూ 14 రీల్స్ అధినేతలు ట్విట్టర్లో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ప్రిమియర్స్ కలుపుకుని ఆదివారం నాటికే 4.35 లక్షల డాలర్లు వసూలు చేసింది ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’. సోమవారం పూర్తయ్యేసరికి హాఫ్ మిలియన్ మార్కు పూర్తయిపోవడం ఖాయం. ఫుల్ రన్ లో ‘భలే భలే మగాడివోయ్’ వసూళ్లను అందుకోలేకపోయినా.. మిలియన్ డాలర్ల మార్కు దాటేయడం మాత్రం లాంఛనమే అని చెప్పాలి.