Begin typing your search above and press return to search.
అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు నాని
By: Tupaki Desk | 20 Feb 2016 11:00 PM ISTటాక్ సూపర్.. రివ్యూలూ కూడా అదిరిపోయాయి.. ప్రమోషన్లు కూడా ఓ రేంజిలో చేస్తున్నారు. కానీ సినిమాకు ఆశించినంత కలెక్షన్లు మాత్రం లేవు. తొలి వారాంతంలో ఈజీగా రూ.10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తుందనుకున్న నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ వీకెండ్లో రూ.6 కోట్లకు కాస్త ఎక్కువగా షేర్ సాధించింది అంతే. వీకెండ్ తర్వాత కలెక్షన్లు పర్వాలేదు అనిపిస్తున్నాయి కానీ.. సినిమాకు వచ్చిన టాక్ కు తగ్గట్లుగా అయితే లేవు. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ థియేట్రికల్ రైట్స్ రూ.15 కోట్లకు కొన్నాడు అభిషేక్. ఆ మొత్తం రికవర్ చేయడం అంత సులువేమీ కాదు.
ఐతే ఇంతకీ టాక్ తగ్గట్లుగా కలెక్షన్లు లేకపోవడానికి కారణం ఏంటి అని చూస్తే.. సినిమాను అన్ సీజన్లో రిలీజ్ చేయడమే కారణమని అర్థమవుతోంది. గత ఏడాది ‘టెంపర్’ సినిమాను కూడా దాదాపుగా ఇదే టైంలో రిలీజ్ చేశారు. దానికి చాలా మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈజీగా రూ.50 కోట్ల మార్కును అందుకుంటుందనుకున్న సినిమా రూ.42 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఫిబ్రవరి అంటే స్టూడెంట్స్ అందరూ పుస్తకాలకు అతుక్కుపోయి ఉంటారు. పరీక్షల హడావుడిలో పడిపోతారు. సినిమాలకు మహారాజ పోషకులు యూతే. ముఖ్యంగా విద్యార్థులు సినిమాలు బాగా చూస్తారు. మిగతా టైంలో ఓకే కానీ.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో థియేటర్లకు వెళ్లడానికి మొహం చెల్లదు. కాబట్టే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లకు దెబ్బ పడుతోంది. ఐతే అమెరికాలో మాత్రం నాని సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.