Begin typing your search above and press return to search.
కృష్ణగాడి వీర ప్రేమ ''లాస్'' గాధ
By: Tupaki Desk | 28 Feb 2016 3:00 PM ISTవరుస భారీ చిత్రాల ఫ్లాప్ ల తర్వాత 14రీల్స్ ఎంటర్టెయిన్ మెంట్.. ఓ మీడియం బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని - మెహ్రీన్ కౌర్ హీరో - హీరోయిన్ లుగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ విడుదలై ఇప్పుడు మూడో వారం గడుస్తోంది. ప్రేక్షకుల నుంచి కూడా పాజిటాక్ వచ్చి, మంచి కలెక్షన్లనే రాబట్టిన కృష్ణగాడిని.. హిట్ అనేందుకు ఆమడ దూరంలో ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు కారణం.. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన మొత్తం సొమ్ములు వెనక్కొచ్చే అవకాశం లేకపోవడమే.
14 రీల్స్ సంస్థ కృష్ణగాడి వీర ప్రేమ గాధను 12 కోట్లతో తెరకెక్కించి, 2 కోట్లు ప్రమోషన్ - ప్రింట్ - పబ్లిసిటీ కోసం వెచ్చించింది. అంటే ఈ మూవీ ఖర్చు 14 కోట్లన్న మాట. ఏపీ - తెలంగాణా హక్కులను 8.5 కోట్లకు అభిషేక్ పిక్చర్స్ కు అమ్మేశారు. శాటిలైట్ హక్కుల రూపంలో 4 కోట్లు వసూలయ్యాయి. ఓవర్సీస్ - రెస్టాఫ్ ఇండియా - మ్యూజిక్ - డిజిటల్ హక్కులతో మరో 4 కోట్లు సమకూరాయి. అంటే.. 14 రీల్స్ సంస్థకు 2 కోట్లు లాభం ముట్టిందన్న మాట.
కానీ కృష్ణగాడు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన మొత్తం 10 కోట్లు మాత్రమే. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లోకి ఎంటర్ అయినా.. ఏపీ - తెలంగాణల్లో మాత్రం సబ్ డిస్ట్రిబ్యూటర్లకు 2 కోట్ల రూపాయల నష్టాలు తప్పడం లేదు. ఫుల్ రన్ లో కనీసం 10 నుంచి 15 శాతం నష్టం తప్పదనే అంచనాలున్నాయి. ఒకవేళ 4, 5 వారాల్లో కూడా ఇదే పొజిషన్ ఉంటే బ్రేక్ ఈవెన్ కు రావచ్చు కానీ.. అంత సీన్ కనబడ్డం లేదు. మొత్తం మీద కృష్ణగాడి వీరప్రేమగాధ చిత్రం నిర్మాతలకు లాభాలను ఇవ్వగా.. ఏపీ, తెలంగాణల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి నష్టాలను మిగుల్చుతోంది.