Begin typing your search above and press return to search.

నాని స్టామినా కృష్ణగాడు తేల్చేశాడా?

By:  Tupaki Desk   |   19 Feb 2016 1:00 PM IST
నాని స్టామినా కృష్ణగాడు తేల్చేశాడా?
X
నేచురల్ నాని స్టామినా ఎంత? బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్షన్లను తీసుకురాగలడు? భలేభలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ 25+ కోట్లకుపై పైగా షేర్ రాబట్టడంతో.. నానికి సరైన సినిమా పడితే కనీసం పాతిక కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే అనుకున్నారంతా. నానికి ఉన్న ఫాలోయింగ్, రేంజ్ తో ఆ మార్క్ ను అందుకోవడం అంత ఇబ్బంది కాదనే ఫీల్ అయ్యారు.

అన్ని ఏరియాల్లోనూ భలేభలే మగాడివోయ్ లాభాల పంట పండిచడమే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు తేడా కొట్టేసింది. కృష్ణగాడి వీర ప్రేమగాధకు మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన రేంజ్ లో లేవు. ఇప్పటికి ఒకవారం కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. అయితే.. ఒక్క యూఎస్ బాక్సాఫీస్ తప్ప మిగిలిన ఎక్కడా అనుకున్న స్థాయిలో వసూళ్లు లేవు. అమెరికాలో మొదటివారానికి గాను 5.7లక్షల డాలర్ల వసూళ్లు సాధించినా.. ఇది కూడా అంచనాల కంటే కొంచె తక్కువే.

మరోవైపు నైజాంలో తొలివారంలో కృష్ణగాడు 2.5 కోట్లు రాబట్టగలిగాడు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం వసూలైంది పట్టుమని 6 కోట్లు మాత్రమే. అంటే.. ఫుల్ రన్ లో 10-12 కోట్ల రూపాయలతో బిజినెస్ క్లోజ్ అవచ్చు. మహా అయితే ఇంకొకటి సాధించచ్చంతే. మరిప్పుడు నాని స్టామినాని కృష్ణగాడి వీర ప్రేమగాధ ప్రూవ్ చేసేసిందని అనుకోవచ్చు. అయితే బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చి, ఆ స్థాయిలో లేకపోవడంతో.. మరో హిట్ సినిమా వస్తేనే, రియల్ స్టామినా అంచనా వేయగలం అన్నది ట్రేడ్ వర్గాల మాట.