Begin typing your search above and press return to search.

కృష్ణగాడికి ఆది గరం వేడి

By:  Tupaki Desk   |   30 Jan 2016 1:30 PM GMT
కృష్ణగాడికి ఆది గరం వేడి
X
నేచురల్ స్టార్ నాని - మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాథ రిలీజ్ కి డేట్ సెట్ అయింది. ఈ మూవీని ఫిబ్రవరి 12న విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. ఓ భయస్తుడైన బాలయ్య అభిమానిగా నాని ఈ సినిమాలో నవ్వులు పంచనున్నాడు. ఫుల్ ప్లెడ్జెడ్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

భలేభలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షుకులు కూడా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారు. మరోవైపు అందాల రాక్షసి తీసిన డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్టర్ కావడంతో.. టెక్నికల్ గా కూడా బాగుంటుందనే అంచనాలున్నాయి. మొదట ఫిబ్రవరి 5న రిలీజ్ చేద్దామని అనకున్నా.. పోటీ ఉండకూడదనే ఉద్దేశ్యంతో, స్పీడున్నోడి కోసం రిలీజ్ డేట్ మార్చారు. అయితే, ఓ వారం లేట్ గా వస్తున్నా.. నానికి పోటీ మాత్రం తప్పడం లేదు. ఈసారి ఆది - ఆదాశర్మ జంటగా నటించిన గరం మూవీని కూడా అదే రోజు రిలీజ్ చేయనున్నారు.

రైటర్ కం డైరెక్టర్ మదన్ రూపొందించిన ఈ మూవీపై కూడా అంచనాలు ఉన్నా.. ప్రస్తుతం ఆది ఫ్లాపుల్లో ఉన్నాడు. కానీ నాని సంగతి అలాక్కాదు. బ్లాక్ బస్టర్ సాధించిన నానితో.. ఆది పోటీకి దిగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే, తమ సబ్జెక్ట్ పై ఉన్న నమ్మకంతోనే ఈ రిస్క్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి నాని, ఆదిల పోరులో గెలిచేదెవరో తెలియాలంటే మాత్రం.. ఓ రెండు వారాలు ఆగాల్సిందే.