Begin typing your search above and press return to search.
'బాస్'తో త్రోబ్యాక్ పిక్ షేర్ చేసిన లేడీ డైరెక్టర్!!
By: Tupaki Desk | 28 July 2020 3:00 PM ISTటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి.. ఆయనతో వర్క్ చేసినప్పటి త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టరుగా వెలిగిన కృష్ణవంశీ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 1995లో గులాబీ సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం 2017లో విడుదలైన నక్షత్రం వరకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. 2009లో వచ్చిన మహాత్మా తరువాత కృష్ణవంశీ నుండి ఆ రేంజ్ హిట్ రాలేదు. మహాత్మా తర్వాత మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం సినిమాలు చేసారు. కానీ అందులో గోవిందుడు అందరివాడేలే ఒకటే పరవాలేదు అనిపించింది. ప్రస్తుతం ఆయన రంగమార్తాండ అనే మూవీ రూపొందిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా నందిని రెడ్డి.. అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన 'అంతఃపురం' సినిమాలోని ఓ స్టిల్ పోస్ట్ చేసింది.
అందులో సముద్రం ఒడ్డున డైరెక్టర్ కృష్ణవంశీ, హీరో సాయికుమార్, హీరోయిన్ సౌందర్య ఉన్నారు. ఆ ఫోటోలో డైరెక్టర్ హీరోహీరోయిన్లకి సన్నివేశం వివరిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఆ ఫోటోతో పాటు.. "బాస్ తో ఉన్నాం. ఆయన ఒక బెస్ట్ ఫిల్మ్ స్కూల్.. అలాగే లైఫ్ లో గురు లాంటివారు. హ్యాపీ బర్త్ డే సార్. ఎల్లప్పుడూ మీ నుండి ఏదొక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం" అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ త్రో బ్యాక్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం నందిని రెడ్డి మరో కొత్త సినిమా ప్లాన్ చేస్తుందట. అది కూడా ఓ కొరియన్ మూవీ రీమేక్ అని సమాచారం. అయితే అందులో కూడా హీరోయిన్ సమంత హీరోయినుగా నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు రూపొందించిన 'ఓ బేబీ' కూడా సమంతతో తెరకెక్కించింది. అది కూడా ఓ రీమేక్ అని తెలుస్తుంది. అయితే ఓ బేబీ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తదుపరి మూవీ స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉందట.