Begin typing your search above and press return to search.

స్టార్ కమెడియన్ కి బ్రేక్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   27 Nov 2019 8:34 AM GMT
స్టార్ కమెడియన్ కి బ్రేక్ ఇస్తాడా?
X
టాలీవుడ్ లో మొన్నటి వరకూ స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగాడు బ్రహ్మానందం. రోజుకి దాదాపు ఐదు లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకునే వాడు. కట్ చేస్తే ఎందుకో సినిమాలు తగ్గిపోయాయి. ఒకానొక టైంలో సినిమాలు లేక గెస్ట్ రోల్స్ తో పాటు రోడ్డు పక్కన కూర్చుని డైలాగ్స్ లేని క్యారెక్టర్ కూడా చేసాడు.

ఎందుకో బ్రహ్మీ లో కామెడీ యాంగిల్ ని మాత్రమే వాడుకున్న దర్శకులు అతనిలో ఉన్న సీరియస్ నెస్ ను వాడుకోలేకపోయింది. వృద్దాప్యంలో అయినా అలాంటి క్యారెక్టర్ పడితే బాగుండని అనుకుంటున్న సమయంలో సరిగ్గా క్రియేటివ్ డైరెక్టర్ రూపంలో బ్రహ్మీకి అలంటి అవకాశం వచ్చింది.

కన్నడ క్లాసిస్ సినిమా 'నట సామ్రాట్' సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న కృష్ణ వంశీ ఈ సినిమాలో బ్రహ్మనందంతో ఓ విభిన్న పాత్రను చేయిస్తున్నాడు. లేటెస్ట్ గా క్యారెక్టర్ కి సంబంధించి లుక్ ని సోషల్ మీడియాలో వదిలాడు కృష్ణ వంశీ. మరి ఈ సినిమాతో అయినా మళ్ళీ బ్రహ్మీ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడా చూడాలి.