Begin typing your search above and press return to search.
ఐదుగురు హీరోలతో కృష్ణవంశీ సినిమా
By: Tupaki Desk | 22 Nov 2015 3:00 PM ISTబాలీవుడ్ లో ఒకే సినిమాలో ఐదుగురు హీరోలు నటిస్తే అది పెద్ద విశేషమేమీ కాదు. అక్కడ మల్టీస్టారర్లు చాలా కామన్. కానీ సౌత్ లో ఇద్దరు హీరోలు కలిసి నటించినా విశేషమే. అలాంటిది తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాల.. ఏకంగా ఐదుగురు ప్రముఖ కథానాయకులతో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ న్యూస్ కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. ఐతే తమిళంలోనే కాదు.. తెలుగులోనూ అలాంటి ప్రయత్నమే జరగబోతోంది. మన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా తాను తీయబోయే థ్రిల్లర్ కోసం ఐదుగురు హీరోల్ని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు ‘రుద్రాక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు, అనుష్క కథానాయికగా నటించబోతున్నట్లు.. ఇంతకుముందు కృష్ణవంశీనే తీసిన ‘డేంజర్’ తరహా థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాటన్నిటికంటే ఆసక్తి రేపుతున్నది ఇందులో ఐదుగురు హీరోలు నటించబోతున్నారన్న వార్తే. మరి ఆ ఐదుగురూ ఎస్టాబ్లిష్డ్ హీరోలేనా.. లేక కొత్తవాళ్లా అన్నదే తెలియాల్సి ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. తమిళంలో బాల ఐదుగురు హీరోలతో తీయబోయే సినిమాలోనూ అనుష్కనే కథానాయికగా అనుకుంటున్నారు. అక్కడా ఇక్కడా అనుష్కే హీరోయిన్ - ఐదుగురు హీరోలుంటారు అంటే.. ఇదేమైనా రెండు భాషల్లో ఒకే కథతో తెరకెక్కబోయే సినిమానా.. లేక యాదృచ్ఛికంగా ఇలా జరగబోతోందా?