Begin typing your search above and press return to search.

కృష్ణవంశీ.. అనుష్క.. రుద్రాక్ష

By:  Tupaki Desk   |   15 Nov 2015 10:58 AM IST
కృష్ణవంశీ.. అనుష్క.. రుద్రాక్ష
X
34 ఏళ్ల వయసులో హీరోయిన్ గా కొనసాగడమే కష్టం. అలాంటిది అనుష్క కుర్ర హీరోయిన్లు కుళ్లుకునే అవకాశాలతో దూసుకెళ్తోంది. త్వరలోనే బాహుబలి-2 - సింగం-3 లాంటి క్రేజీ మూవీస్ లో నటించబోతున్న స్వీటీ.. కొత్తగా రెండు లేడీ ఓరియెంటెడ్ భారీ ప్రాజెక్టులుు చేయబోతోంది. అందులో ఒకటి ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో చేయబోయే భాగమతి. ఇంకోటి దిల్ రాజు సినిమా.

రాజు నిర్మాణంలో తెరకెక్కబోయేది కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీనే. దానికి దర్శకుడు మరెవరో కాదు.. కృష్ణవంశీ అని సమాచారం. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన కృష్ణవంశీ.. తనదైన శైలిలో ఓ థ్రిల్లర్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అనుష్క ప్రధాన పాత్రలో ఆయన ‘రుద్రాక్ష’ అనే థ్రిల్లింగ్ కథ ఒకటి రాశాడట.

ఆ స్క్రిప్టు రాజుకు తెగ నచ్చేయడం.. అనుష్కను కలిసి ఆ కథ చెప్పగా ఆమె కూడా పచ్చజెండా ఊపేయడం.. అయిపోయాయి. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది. ఐతే ‘రుద్రాక్ష’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించడానికి రాజు ఫిలిం ఛాంబర్ కు వెళ్తే ఆ టైటిల్ వేరెవరో రిజిస్టర్ చేయించారని తెలియడంతో కొత్త టైటిల్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.