Begin typing your search above and press return to search.
భార్య బర్త్ డేని సెలబ్రేట్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్...!
By: Tupaki Desk | 15 Sept 2020 2:40 PM ISTసీనియర్ నటి రమ్యకృష్ణ - క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రమ్యకృష్ణ.. డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రేమాయణం సాగిస్తోందని అప్పట్లో మీడియా కోడై కూసింది. అయితే అందరి అనుమానాలను నిజం చేస్తూ ఓ గుడిలో పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు. ఈ జంటకు ఒక కొడుకు కూడా జన్మించాడు. సాధారణంగా వివాహం అనంతరం సినిమాలకు దూరం అయ్యే హీరోయిన్స్ లిస్ట్ లో రమ్యకృష్ణ చేరుతారని అందరూ అనుకున్నారు. కానీ రమ్యకృష్ణ మాత్రం తనకు నటనపై ఉన్న ఆసక్తిని వదులుకోకుండా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. 'బాహుబలి' 'సోగ్గాడే చిన్నినాయనా' 'క్వీన్' వంటి సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతోంది. ఇక కృష్ణ వంశీ టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.
కాగా నిన్న రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి ఆమె బర్త్ డేని సెలెబ్రేట్ చేశారు కృష్ణ వంశీ. దీనికి సంబంధించిన ఫోటోలను రమ్యకృష్ణ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో రమ్యకృష్ణ - కృష్ణవంశీ లతో పాటు కొడుకు రిత్విక్ వంశీ మరియు ఇతర కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా రమ్యకృష్ణ ప్రస్తుతం తమిళ తెలుగు భాషల్లో సీరియల్స్ వెబ్ సిరీస్ మరియు సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. గతంలో భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో 'చంద్రలేఖ' 'శ్రీ ఆంజనేయం' సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ చాలా ఏళ్ళ తర్వాత 'రంగమార్తాండ' లో నటిస్తోంది.