Begin typing your search above and press return to search.

ఆ సినిమా అప్పులు తీర్చేందుకు 5 ఏళ్ళు: కృష్ణవంశీ

By:  Tupaki Desk   |   4 Jan 2023 3:30 PM GMT
ఆ సినిమా అప్పులు తీర్చేందుకు 5 ఏళ్ళు: కృష్ణవంశీ
X
డిఫరెంట్ కంటెంట్ తో విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన అతి కొద్ది మంది దర్శకులు కృష్ణవంశీ ఒకరు. గులాబీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు మురారి చంద్రలేఖ నిన్నే పెళ్ళాడుతా చందమామ ఖడ్గం ఇలా ఎన్నో సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఇక అప్పట్లో అయితే స్టార్ హీరోలు కూడా అతనితో సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. జూనియర్ ఎన్టీఆర్ తో రాఖీ ప్రభాస్ తో చక్రం గోపీచంద్ మొగుడు రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే ఇలా అందరి హీరోలు కూడా ఈ దర్శకుడితో సినిమా చేస్తూ వారి నటన శైలిని మరింత ఎక్కువగా అప్గ్రేడ్ చేసుకునేవారు. అయితే స్టార్ హీరోలతో మాత్రం ఎక్కువ స్థాయిలో కృష్ణవంశీ సక్సెస్ అందుకోలేకపోయాడు.

అయినప్పటికీ కూడా అతనికి క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా కృష్ణవంశీ కొత్తలో సింధూరం అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చిన విధానం కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ సినిమా కథ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెర పైకి వచ్చింది.

అయితే కృష్ణవంశీ సొంత ప్రొడక్షన్ లోనే ఆ సినిమాలో నిర్మించడం జరిగింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సక్సెస్ కాలేదు. అంతే కాకుండా కృష్ణవంశీ ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇక ఆ అప్పులను తీర్చడానికి ఆయనకు దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే సింధూరం సినిమాకు ఇప్పటికీ కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాలోని పాటల గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

అయితే ఒక అభిమాని ఇటీవల మళ్లీ సింధూరం సినిమాలను విడుదల చేయాలి అని కోరగా ఆ సినిమా అప్పులను తీర్చడానికి నాకు ఐదేళ్ల సమయం పట్టింది అని ఆయన ఒక డైరెక్ట్ గా సమాధానం అయితే ఇచ్చారు. ఇక ప్రస్తుతం కృష్ణ వంశీ నుంచి రంగ మార్తాండా అనే సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.