Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: బికినీతో అందాలు ఆరబోత

By:  Tupaki Desk   |   6 July 2018 9:32 AM GMT
ఫొటో స్టోరీ: బికినీతో అందాలు ఆరబోత
X
సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది సెలబ్రెటీలు యాక్టివ్ గా ఉంటున్నారు. వారే కాదు.. ఎలాంటి స్టార్ ఇమేజ్ లేకున్నా.. ఒక్క సినిమాలోనూ నటించకుండానే పెద్ద పెద్ద హీరోయిన్ల పిల్లలు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో కలిగి ఉన్నారు. ఆ కోవకే చెందినది కృష్ణ ష్రాఫ్. ఈమె బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె.. ఇటీవలే బాలీవుడ్ లో హీరోగా ఎదుగుతున్న టైగర్ ష్రాఫ్ కు స్వయాన చెల్లెలు. ప్రస్తుతం ఈమె తన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి మతిని పోగొడుతోంది.

తాజాగా ఈమె బికినీ వేసుకొని బీచ్ లో పడుకొని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె సెలవుల్లో భాగంగా థాయ్ లాండ్ లో విహరిస్తోంది. అక్కడి ఫి ఫి ఐలాండ్ బీచ్ లో బికినీ వేసుకొని ఇసుకలో పడుకొని ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె నాభిపైన పూలతో వేసిన టాటూ ఆకట్టుకుంటోంది. ఆమె నవ్వులు కూడా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి..

ఈ అమ్మడు అందం చూస్తుంటే బాలీవుడ్ లోనే పెద్ద హీరోయిన్ అయిపోవడం ఖాయమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బహుషా ఈ గ్లామర్ ఫీల్డ్ లోని అడుగుపెట్టాలనే ఇలా బీచ్ లో హాట్ హాట్ అందాలు ఆరబోసిందని భావిస్తున్నారు.