Begin typing your search above and press return to search.

చివరగా ఆ ప్రమాదాలు భయపెట్టాయి

By:  Tupaki Desk   |   24 Jan 2018 10:33 PM IST
చివరగా ఆ ప్రమాదాలు భయపెట్టాయి
X
1951 నవ్వితే నవారత్నాలు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన కృష్ణ కుమారి గారు ఈ రోజు తుది శ్వాసను విడిచిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది మహా నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆమె భౌతికంగా ఇప్పుడు లేకపోయినా సినిమాల ద్వారా ప్రపంచం ఉన్నంత వరకు ఉంటారు. అయితే తారల జీవితంలో అప్పుడప్పుడు కొన్ని ఉహించని ఘటనలు కూడా జరుగుతుంటాయని అందరికి తెలిసిందే. అలాగే కృష్ణ కుమారి లైఫ్ లో కూడా కొన్ని ఉహించని బయలు ప్రమాదాలు ఎదురయ్యాయి.

చివరగా ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన అనుభవాలను చెప్పుకున్నారు. అలాగే రెండు ప్రమాదాల గురించి కూడా ఆమె వివరించారు. మొదటి ఘటన గురించి.. ప్రముఖ దర్శకుడు విఠలాచర్య బందిపోటు సినిమా షూటింగ్ లో ఒక సీన్ కు ప్రాణం భయంతో వనికిపోయాను. వగలరాణివి నీవే’ అనే పాట షూటింగ్ లో రామారావు గారు చెట్టు మీద ఉంటారు. నేను ఆయన్ని పట్టుకోవడానికి గుర్రపు స్వారీ చేయాలి. కానీ నాకు అలవాటు లేదు. బయపడుతుంటే విఠలాచర్య గారు ఏం పర్లేదు మంచి గుర్రం అని చెప్పడంతో నేను ఎక్కగానే అది పరుగులు తీసింది. కానీ విఠలాచర్య గారు ముందు జాగ్రత్తగా ఒక నాలుగు మగ గుర్రాలను సెట్ చేశారు. కొద్దీ దూరం వెళ్లగానే పరుగులు పెట్టిన గుర్రం ఆగిపోయింది. దాంతో గండం తప్పింది అని సంతోషపడ్డా.

ఇక మరొక ఘటన విషయనికో వస్తే.. అప్పుడు రామరవుగారితోనే షూటింగ్. లాక్షాధికారి లాస్ట్ డే షూటింగ్. దాచాలంటే దాగదులే - దాగుడు మూతలు సాగవులే’ అనే పాట చిత్రీకరణలో నేను రామారావు గారు చేయి చేయి పట్టుకొని సముద్రం ఒడ్డు వరకు వెళ్లాలి. అయితే అలా వెళ్లిన కొద్దీ సేపటికే ఒక పెద్ద అల వచ్చి మమ్మల్ని లోపలికి లాక్కెళ్లింది. రామారావు గారు నా చేయి అస్సలు వదల్లేదు. నాకు చాలా భయం వేసింది. అయితే కొద్దీ సేపటికే మొత్తానికి దేవుడి దయ వల్ల బయటపడ్డం అని కృష్ణ కుమారి అలనాటి జ్ఞాపకాలను కొన్ని రోజుల క్రితం గుర్తుచేసుకున్నారు.