Begin typing your search above and press return to search.

రమేష్‌ బాబు కెరీర్ పై కృష్ణ కామెంట్స్

By:  Tupaki Desk   |   1 Sept 2021 5:00 AM IST
రమేష్‌ బాబు కెరీర్ పై కృష్ణ కామెంట్స్
X
టాలీవుడ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు కృష్ణ అనడంలో సందేహం లేదు. సూపర్‌ స్టార్ కృష్ణ టాలీవుడ్‌ కు హాలీవుడ్‌ హంగులు అద్దిన మొదటి స్టార్. టాలీవుడ్ కు ఎన్నో కొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన గొప్ప టెక్నీషియన్ కృష్ణ అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో ఏ హీరో చేయని సాహసాలు మరియు ఛాలెంజింగ్ పాత్రలను ఆయన చేయడం జరిగింది. టాలీవుడ్ లో ఎన్నో ఫస్ట్‌ లు ఆయన సొంతం అంటూ ఉంటారు. అలాంటి కృష్ణ వారసులు ఇద్దరు సినిమా రంగ ప్రవేశం చేశారు. మహేష్‌ బాబు బాల నటుడిగా చిన్నప్పుడే ఎంట్రీ ఇవ్వగా పెద్ద కొడుకు రమేష్‌ బాబు హీరోగా పలు సినిమాల్లో నటించారు.

కృష్ణ తన ఇద్దరు కొడుకులతో కలిసి నటించిన సందర్బాలు కూడా ఉన్నాయి. పోరాటం అనే సినిమాలో ముగ్గురు నటించారు. మహేష్‌ బాబు మరియు రమేష్‌ బాబు లు ఇద్దరు కూడా టాలీవుడ్‌ లో మంచి స్టార్‌ లుగా గుర్తింపు దక్కించుకుంటారని అప్పట్లో సిని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేసేవారు. రమేష్‌ బాబు కూడా నటుడిగా మంచి పరిణితి సాధించాడు. కాని ఆయనకు మంచి సినిమాలు పడలేదు. నటుడిగా వచ్చిన పేరు కమర్షియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు. అందుకే రమేష్‌ బాబుకు సక్సెస్ లు రాలేదు.

కమర్షియల్‌ గా సక్సెస్ కాలేక పోవడంతో పాటు మంచి సినిమాలు పడటం లేదనే ఉద్దేశ్యంతో రమేష్‌ బాబుకు సినిమాలపై ఇంట్రెస్ట్‌ పోయిందని.. దాంతో అతడు సినిమాలకు దూరంగా ఉన్నాడు అంటూ కృష్ణ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రమేష్‌ బాబు ఇంకొంత కాలం ప్రయత్నించి ఉంటే బాగుండేది అనేది అప్పట్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు కాకున్నా మళ్లీ ఇప్పుడు కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రయత్నించవచ్చు కదా అంటూ కొందరు కోరుకుంటున్నారు. నిర్మాతగా కొన్నాళ్ల వరకు కనిపించిన రమేష్‌ బాబు గత దశాబ్ద కాలంగా అసలు కనిపించకుండా పోయాడు. ఆయన తయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. రమేష్‌ బాబు పోలికలతో కృష్ణ రంగు రూపు వచ్చిన ఆ కుర్రాడు ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని ఆశిద్దాం.