Begin typing your search above and press return to search.
'శ్రీ శ్రీ అవార్డ్ - 2020' కి ఎంపికైన సూపర్ స్టార్...!
By: Tupaki Desk | 17 Jun 2020 8:30 PM ISTతెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే అగ్ర నటులలో 'నటశేఖరుడు' కృష్ణ ఒకరు. 70స్ 80స్ లలో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ పొందిన కృష్ణ 'సూపర్ స్టార్'గా వెలుగొందాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో పలు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించిన కృష్ణ 1964లో వచ్చిన 'తేనెమనసులు' సినిమాతో హీరోగా మారాడు. ఇక తాను నటించిన మూడవ సినిమా 'గూఢచారి 116'తో సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఏడాది పొడవునా సినిమాల్లో నటిస్తూ సినీ చరిత్రలోనే ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కృష్ణ సినీ కెరీర్ లో 350 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. వాటిలో 'సింహాసనం' 'బాలచంద్రుడు' 'కొడుకు దిద్దిన కాపురం' 'ముగ్గురు కొడుకులు' వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వయసు రీత్యా సినిమాలు తగ్గించి విశ్రాంతి తీసుకుంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ.
ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణను 2020 సంవత్సరానికి గాను 'మహాకవి శ్రీ శ్రీ సాహిత్యానిధి' అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును టి. కృష్ణ మెమోరియల్, నాగార్జున కళాపరిషత్ (కొండపల్లి) మరియు ఎక్స్ రే సాహిత్య సంస్కృత సేవాసంస్థ (విజయవాడ) కలిసి సంయుక్తంగా శ్రీశ్రీ 37వ వర్థంతి సందర్భంగా అందజేయనున్నారు. సాహిత్య చలనచిత్ర రంగాలలో రాణించిన ప్రముఖులకు మహాకవి శ్రీ శ్రీ అవార్డును ప్రతి ఏటా ప్రదానం చేస్తారు. కాగా కృష్ణ నటించిన దేశభక్తి సినిమా 'అల్లూరి సీతారామరాజు'లోని తెలుగు వీర లెవరా’ పాటకి సాహిత్యాన్ని అందించిన వారు మహాకవి శ్రీరంగం శ్రీనివాసులు. ఈ పాటకి జాతీయ స్థాయిలో అవార్డు కూడా లభించింది. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు పాత్రని కృష్ణ పోషించిన విధానాన్ని దేశమంతా మెచ్చుకుందని పలు సందర్భాల్లో శ్రీ శ్రీ చెప్పుకొచ్చారట. కాగా ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మరియు అన్ని కుదిరిన సమయంలో కృష్ణ కి ఈ అవార్డు ప్రధానం చేయబడిందని నిర్వాహకులు వెల్లడించారు.