Begin typing your search above and press return to search.

కొరియర్ బాయ్ కి పడిపోయిన యంగ్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   7 Sep 2015 9:30 AM GMT
కొరియర్ బాయ్ కి పడిపోయిన యంగ్ డైరెక్టర్
X
ఎప్పుడో మూడేళ్ల ముందు మొదలై.. ఎట్టకేలకు ఈ నెలలో విడుదల కాబోతున్న సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాను నూతన దర్శకుడు ప్రేమ్ సాయి రూపొందించాడు. గౌతమ్ మీనన్ నిర్మాత. బాగా లేటైనప్పటికీ ఈ సినిమా మీద నితిన్ సహా యూనిట్ సభ్యులు చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారు. ట్రైలర్ చూసినా కూడా సినిమా ‘పాతబడ్డ’ ఫీలింగేమీ కలిగించలేదు. దీంతో లేటుగా వస్తున్నా క్రేజ్ మాత్రం బాగానే ఉందీ సినిమాపై. ఇప్పుడు లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య మాటలు వింటుంటే సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ యువ దర్శకుడు ఈ మధ్యే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ప్రివ్యూ చూసాడట. సినిమా తనకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందని అంటున్నాడు కృష్ణచైతన్య.

‘‘కొరియర్ బాయ్ కళ్యాణ్ చూశా. ఇది ష్యూర్ షాట్ హిట్ ఫిలిం. ఇదొక అమేజింగ్ కాన్సెప్ట్. ప్రేక్షకుల్ని కుర్చీల అంచుల్లో కూర్చోబెట్టేలా ఆసక్తి రేపే సినిమా. టీమ్ సభ్యులందరికీ ఆల్ ద బెస్ట్’’ అని కృష్ణచైతన్య తన సోషల్ మీడియా పేజీలో రాశాడు. ఐతే కృష్ణచైతన్య పనిగట్టుకుని ఇలా నితిన్ సినిమా గురించి చెప్పడానికి కారణం లేకపోలేదు. అతను త్వరలోనే నితిన్ తో సినిమా చేయబోతున్నాడు. అలాగని అదే పనిగా నితిన్ సినిమాకు ఎండోర్స్ చేయాల్సిన పని లేదు. సినిమా బాలేకుంటే ఈ వ్యాఖ్యలకు వాల్యూ లేకుండా పోతుంది కదా. కాబట్టి కృష్ణచైతన్య మాటల్లో వాస్తవం ఉండే ఉంటుంది. నితిన్ కూడా ఇండియాలో ఇప్పటిదాకా రాని కాన్సెప్ట్ అని.. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని అన్నాడు. ఐతే కొరియర్ బాయ్ విన్యాసాలు చూడ్డానికి ఇంకో ఐదు రోజులు ఎక్కువ ఎదురు చూడాలి. ఈ శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే బుధవారానికి (సెప్టెంబరు 16) వాయిదా పడింది.