Begin typing your search above and press return to search.

నితిన్ డైరక్టర్.. కాన్ఫిడెంటుగా ఉన్నాడే

By:  Tupaki Desk   |   30 Oct 2017 9:16 AM GMT
నితిన్ డైరక్టర్.. కాన్ఫిడెంటుగా ఉన్నాడే
X

పాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ప్రస్తుతం నితిన్ తో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సమర్పణలో త్రివిక్రమ్ - సుధాకర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లై సినిమాతో అపజయాన్ని అందుకున్న నితిన్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

అయితే కృష్ణ చైతన్య రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్య్వూలో చిత్ర విశేషాలని తెలియజేశారు. సినిమాలో నితిన్ హైదరాబాద్ కి చెందిన యువకుడుగా కనిపిస్తూ.. అమెరికాలో జాబ్ చేస్తుంటాడట. నితిన్ కెరీర్ లో ఇదొక మంచి మూవీ అవుతోందని నమ్మకంగా చెబుతూ.. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం యూఎస్ లోనే ఉంటుందట. మంచి లొకేషన్స్ లో చిత్రీకరణను జరుపుతున్నామని అలాగే నటరాజన్ సుబ్రమణ్యన్ ఫొటోగ్రఫీ సినిమాలో హైలెట్ గా నిలవనుందట.

ఇక ఎప్పటికపుడు షూటింగ్ అప్డేట్స్ ని పవన్ - త్రివిక్రమ్ కి పంపిస్తున్నామని దర్శకుడు తెలిపాడు. అమెరికా షెడ్యూల్ అయిపోగానే నెక్స్ట్ షెడ్యూల్ ని నవంబర్ లో మొదలుపెడతామని కృష్ణ చైతన్య అంటున్నాడు. ఇతను ఇంతకుముందు రౌడీ ఫెలో సినిమాను తీశాడు. ఆ సినిమాలో డైలాగులు తనకెంతో ఇష్టమని త్రివిక్రమ్ మనకు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు స్వయంగా త్రివిక్రమే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇకపోతే కృష్ణచైతన్య కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడని ఆయన మాటలు వింటే అర్ధమవుతోంది.