Begin typing your search above and press return to search.

మళ్లీ అమెరికా అంటున్న నితిన్ అండ్ కో

By:  Tupaki Desk   |   3 July 2017 7:30 AM GMT
మళ్లీ అమెరికా అంటున్న నితిన్ అండ్ కో
X
ఒక్కోసారి కొంతమంది హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఒకటే చోట సినిమాలు చేస్తుంటారు. అప్పట్లో మెగాస్టార్ చిరు సింగపూర్ తో ప్రేమలో పడి.. అక్కడే ఓ రెండు మూడు సినిమాలు చేశారు. ఆ తరువాత నాగార్జున కూడా ఓ రెండు మూడు సినిమాలు స్విట్జర్లాండ్ బ్యాక్ డ్రాపులో చేయడం మనం చూశాం. ఇప్పుడు నేటి తరం హీరో నితిన్ కూడా ఇదే తరహాలో మళ్ళీ అమెరికా అంటున్నాడు తెలుసా.

మొన్ననే 40 రోజులపాటు ''లై'' సినిమా షూటింగ్ కోసం అమెరికాలోనే ఉన్నాడు నితిన్. ఈ సినిమా తరువాత లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరక్షన్లో ఒక సినిమాను చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. పవన్ కళ్యాణ్‌ అండ్ త్రివిక్రమ్ ఈ సినిమాను కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే అమెరికాలో కొన్ని లొకేషన్స్ చూసి స్టన్ అయిన కృష్ణ చైతన్య.. వెంటనే నితిన్ సినిమాను అక్కడే షూట్ చేయాలని ఫిక్సయ్యాడట. ఆ లొకేషన్లన్నీ నితిన్ అండ్ త్రివిక్రమ్ కు కూడా నచ్చేయడంతో.. త్వరలోనే టీమ్ అక్కడకు వెళ్ళనుంది. 'లై' సినిమా ఇక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసేసి.. నితిన్ అండ్ కో అక్కడికి వెళుతుందట. టీమ్ లో కొంతమందికి వీసాలు కావాలి కాబట్టి.. ఇప్పుడు వాళ్ళు ఆ పనిలో ఉన్నారని టాక్.

ఇకపోతే బ్యాక్ టు బ్యాక్ ఇలా అమెరికాలో షూటింగ్ చేసిన నితిన్ ను చూసి.. ఇప్పుడు చాలామంది ఇదే తరహాలో ఏదన్నా ఫారిన్ డెస్టినేషన్ ను ఎంచుకుని అక్కడే వరుసగా ఓ రెండుమూడు సినిమాలు చేస్తారేమో చూడాలి. ఈ మధ్యనే నాని కూడా నిన్ను కోరి కోసం అమెరికాలోనే షూటింగ్ అంతా చేశాడు. చూద్దాం ఏమవుతుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/