Begin typing your search above and press return to search.
'కొండ పొలం' నవలను సినిమాగా తీస్తున్న క్రిష్!
By: Tupaki Desk | 4 Sept 2020 11:02 PM ISTదగ్గుబాటి రానా కథానాయకుడిగా గుంకీ ఫేం ప్రభు సోల్మన్ దర్శకత్వంలో అరణ్య (హాథీ మేరా సాథీ) చాలా కాలంగా సెట్స్ పైనే ఉంది. కొండలు అడవులు పచ్చదనం జలాశయాలు ఏనుగులు అంటూ బోలెడంత హడావుడి ఉన్న ఈ మూవీకి విజువల్ గ్రాఫిక్స్ పని చాలా ఎక్కువ. పైగా బాగా ఎండిపోయి ఎర్రబారిన అడవిని తెరపై ఆద్యంతం చూపించాల్సి ఉండడంతో ఆ పనికి అంతూ దరీ లేదని తెలిసింది. ఏదైతేనేం.. రానా ఆ మూవీని రిలీజ్ చేసేందుకు చాలా సమయమే వేచి చూడాల్సి ఉంటుంది.
అయితే ఈలోగానే మరో అడవి నేపథ్యంలో సినిమాని తీసేస్తూ క్రిష్ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇది కూడా ఫారెస్ట్ అందులో పోడు వ్యవసాయం చేసే రైతులు వారిని వెంటాడే పులి కథ అనగానే ఒకటే ఆసక్తి నెలకొంది. వికారాబాద్ అడవుల్లో అతడు ఈ మూవీని శరవేగంగా తెరకెక్కించేస్తున్నాడు. ఇటీవల పవన్ జానపద మూవీని పక్కన పెట్టి ఈ మూవీపైనే పడ్డాడు క్రిష్. వేగంగా షాట్స్ అన్నీ పూర్తి చేసి గ్రాఫిక్స్ పనులు మొదలెట్టేస్తాడట.
ఇక ఈ మూవీకి తానా అవార్డ్.. 2లక్షల బహుమతి గెలుచుకున్న `కొండ పొలం` అనే నవల స్ఫూర్తి అని తెలిసింది. పోడు వ్యవసాయం అంటే చాలా రిస్కులుంటాయి. అడవి జంతువులు తిరగాడే చోట నీళ్లు లేని కారడవిలో రైతు జీవనంపై సినిమా. ఇక పచ్చదనానికి కొదవ ఉండదు. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి నవల ఇది. హక్కులు కొనుక్కుని సినిమాటిక్ గా మార్చారట. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ -రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్నారు.
అడవి నేపథ్యం అనగానే రానా నటిస్తున్న అరణ్య గుర్తుకు రావడం ఖాయం. దాంతో పోలిక లేకపోయినా కానీ క్రిష్ ఇలాంటి ఆఫ్ బీట్ మూవీల్ని అద్బుథంగా పిక్చరైజ్ చేస్తాడన్న నమ్మకం ఆయన అభిమానుల్లో ఉంది మరి. ఇలాంటివి హాలీవుడ్ లోనే ఎక్కువ తీశారు. మనవాళ్లు విభిన్నమైన కాన్సెప్టులు ఎంచుకునే సీజన్ ఇప్పటికి కానీ రాలేదు. ప్రస్తుతం ప్రభు సోల్మన్ లా.. క్రిష్ తనదైన శైలిలో డేరింగ్ గా ఈ కొత్త కాన్సెప్టును ముందుకు తెచ్చాడు.