Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో కంచె తెంచేసుకుంటున్నాడా!?

By:  Tupaki Desk   |   11 March 2017 7:45 PM IST
మెగాస్టార్ తో కంచె తెంచేసుకుంటున్నాడా!?
X
ట్యాలెంటెడ్ దర్శకుడు క్రిష్.. గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో చేసిన ఖబడ్దార్ కామెంట్స్.. అప్పట్లో గట్టిగానే ప్రభావం చూపాయి. పోటీగా విడుదలవుతున్న చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 10 కి ఆ కామెంట్స్ ను ముడి పెట్టి బాగానే రచ్చ చేశారు.

ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని కానీ.. వేరెవరినీ ఉద్దేశించినవి కావంటూ క్లారిటీ ఇచ్చినా.. పెద్దగా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఆ మచ్చ తుడిచేసుకుని.. మెగా ఫ్యామిలీకి తనకు మధ్య ఏర్పడ్డ కంచె తెంచేసుకున్నాడు క్రిష్. రీసెంట్ గా ఈయన వెంకటేష్ తో సినిమా చేసేందుకు కథతో సమస్య వచ్చింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవిని అక్కడే కలిశాడు క్రిష్. అంతే కాదు.. ఓ మాంచి కథ కూడా చెప్పాడట. మెగాస్టార్ కూడా క్రిష్ చెప్పిన కథ ఆసాంతం ఆసక్తిగా వినడమే కాదు.. తన అనుభవంతో కొన్ని మార్పులు సూచించారట.

కమర్షియల్ యాంగిల్ లో చిరంజీవి ఇచ్చిన ఇన్ పుట్స్ ప్రకారం.. కొన్ని మార్పులు చేసుకుని మళ్లీ కలుస్తానని చెప్పాడట క్రిష్. అన్నీ ఓకే అయితే.. ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయ్. అసలు క్వశ్చన్ ఏంటంటే.. ఇంతకీ ఈ కథ మెగాస్టార్ కా.. మెగా పవర్ స్టార్ కా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/