Begin typing your search above and press return to search.

ఆ కథ చెప్పేవరకు క్రిష్ కు నిద్ర పట్టలేదట

By:  Tupaki Desk   |   10 Jan 2017 8:08 AM GMT
ఆ కథ చెప్పేవరకు క్రిష్ కు నిద్ర పట్టలేదట
X
తెలుగు సినిమా గమ్యాన్ని మార్చాలని.. కొత్త దారి పట్టించాలని తన సినిమాలతో ప్రయత్నిస్తున్న దర్శకుల్లో క్రిష్ ఒకరు. భిన్నమైన సినిమాలతో ఆకట్టుకునే కథనంతో ఇప్పటికే ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘గమ్యం’ - ‘వేదం’ - ‘కృష్ణంవందే జగద్గురుమ్‌’ - ‘కంచె’ ఇలా క్రిష్‌ చిత్రాలన్నీ భిన్నమైన పంథాలో సాగినవే. మనసు తొలిచే కథలనే తెరకెక్కిస్తా అని అంటారు ఈ దర్శకుడు. తొలి తెలుగు చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి కథను సినిమాగా రూపకల్పన చేయడంలో ఇలాంటి తపనే పురికొల్పిందట ఆయన్ను. ఈ సినిమా తీయాలని అనిపించిన తరువాత బాలకృష్ణతోనే తీయాలని అనుకున్నారట.. దీంతో బాలయ్యకు కథను చెప్పేవరకు ఆయనకు నిద్రపట్టలేదట.

మామూలుగానే క్రిష్ కు ప్రాచీన భారత చరిత్ర తెలుసుకోవడం ఆసక్తి అట. అయితే.. అమరావతిలోని స్థూపాలు, నాలుగైదేళ్ల కిందట కోటి లింగాల దగ్గర లభించిన శాతవాహనుల నాణాలు చూశాక శాతవాహనుల చరిత్ర చదవడం ప్రారంభించారట. అప్పుడే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆలోచన ఆయన బుర్రలో మొదలైంది. వేరే చిత్రాలు చేస్తున్నా..ఈ సినిమాకు సంబంధించిన పరిశోధన ఆపలేదు. గూగుల్‌ బుక్స్‌ లోని చాలా సమాచారం.. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాసిన చారిత్రక గ్రంథాలు... మెగస్తనీస్‌ ఇండికా వంటివన్నీ చదివేశారట. ఆ తరువాత మార్చిలో బాలకృష్ణను కలిసి రెండు గంటల పాటు కథ వినిపించారట. మొత్తం స్టోరీ బోర్డ్‌ తో సహా కథ విన్న ఆయన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూసినట్లుంది అని ప్రశంసించారు. మీరు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు సినిమా చేద్దాం అన్నారట.

కథ రాస్తున్నప్పుడే బాలకృష్ణ గారే శాతకర్ణి అనుకున్నారట క్రిష్.. ఆయన తప్ప మరే నటుడు ఊహలోకి రాలేదట. మొత్తానికి క్రిష్ అలా బాలయ్యను శాతకర్ణిగా మార్చేశారన్నామాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/