Begin typing your search above and press return to search.

ఇంస్టాలో అడుగుపెట్టిన 'పవర్ స్టార్' డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   11 March 2021 6:45 AM GMT
ఇంస్టాలో అడుగుపెట్టిన పవర్ స్టార్ డైరెక్టర్..!
X
తెలుగు ఇండస్ట్రీలోకి పవర్ స్టార్ రీఎంట్రీ ఇస్తూనే వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టేసాడు. అయితే ఇప్పటికే వకీల్ సాబ్ పూర్తైపోయింది కాబట్టి ముందుగా అదే రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాను కూడా కంప్లీట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీరియడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సీనియర్ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే మొఘలుల సామ్రాజ్యంలోని ఓ బందిపోటు చుట్టూ తిరుగుతుందని టాక్. హిస్టోరికల్ మూవీ కావడంతో భారీ సెట్లతో ఆ కాలంనాటి నేటివిటీని ప్రతిబింబించేలా డైరెక్టర్ రూపొందిస్తున్నాడట. అలాగే పవన్ కెరీర్లోనే ఫస్ట్ హిస్టోరికల్ మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

దర్శకుడు క్రిష్ కూడా భారీ గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే హిస్టోరికల్ ఫిలిమ్స్ ఆల్రెడీ క్రిష్ తీసాడు కాబట్టి ఎలాంటి మిస్టేక్ కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు వీరమల్లు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ అసలు టైటిల్ ఏంటనేది శివరాత్రి రోజున అంటే ఈరోజు ప్రకటించనున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా.. డైరెక్టర్ క్రిష్ ఇటీవలే ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసాడు. తన ట్విట్టర్ ఖాతాకు ఇంస్టాను కూడా జతచేసాడట. ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫస్ట్ పోస్ట్ కూడా పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ పోస్ట్ ఏంటంటే.. పవర్ స్టార్ తో తీస్తున్న సినిమా షూటింగ్ స్పాట్ పిక్. పవన్ సినిమా షూటింగ్ కాబట్టి ఫ్యాన్స్ అలా లైక్స్ కొడుతూ పిక్ వైరల్ చేస్తున్నారు.