Begin typing your search above and press return to search.

కామెంట్: ఏవండోయ్.. క్రిష్‌ వచ్చాడు!!

By:  Tupaki Desk   |   14 Jan 2017 4:00 AM IST
కామెంట్: ఏవండోయ్.. క్రిష్‌ వచ్చాడు!!
X
మామూలుగా అందరూ 79 రోజుల్లో దర్శకుడు క్రిష్‌ ''గౌతమిపుత్ర శాతకర్ణి'' సినిమాను తీశాడని చాలా గొప్పగా చెబుతున్నారు. అవును అది పెద్ద విషయమే. అయితే అంతకంటే పెద్ద విషయం మరొకటి కూడా ఉందిక్కడ. పదండి ఓసారి చూద్దాం.

నిజానికి బాహబలి సినిమా వచ్చిన తరువాత విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సినిమాలను చేయడంలో అసలు భారతదేశ చలనచిత్ర స్థాయి పెరిగింది. ఆ తరువాత రాజమౌళి తీసిన కళాఖండాన్ని బీట్ చేయాలని చాలామంది దర్శకులు ప్రయత్నించారు. సంజయ్ లీలా భన్సాలి బాజీరావ్ మస్తానీ అని వచ్చినా.. తమిళ హీరో విజయ్ పులితో వచ్చినా కూడా.. ఆ పని సాధ్యపడలేదు. దానికి కారణం.. వారికి విజువల్ ఎఫెక్ట్స్ ను హ్యాండిల్ చేయడంలో అనుభవం లేకపోవడమే. అందుకే ఆయా సినిమాలో మిగతా భాగాలు బాగున్నా కూడా విజువల్ ఎఫెక్ట్స్ దగ్గర తేలిపోయాయ్. దానితో అసలు రాజమౌళిని బీట్ చేసే డైరక్టర్ ఇప్పుడప్పుడే ఇండియాలో దొరకడం కష్టం అనుకున్నారంతా. కాని అదిగో.. క్రిష్‌ ఆ ఫీలింగ్ నే మార్చేశాడు.

మధ్య ప్రదేశ్‌ లోని ఇండోర్ లో ఒక ప్యాలెస్ దగ్గర.. బాలయ్య.. హేమామాలినిలతో కూడిన పట్టాభిషేకం సీన్లు చిత్రీకరించాడు క్రిష్‌. కట్ చేస్తే.. అమరావతి నగరంలో కృష్ణా నది వడ్డున ఈ సీన్లు జరిగినట్లు మనం సినిమాలో చూశాం. అంటే క్రిష్‌ ఏ రేంజులో విజువల్ ఎఫెక్ట్స్ చేయించాడో చూడండి. ఇక శాతకర్ణి యుద్దాల పరంపర.. రకరకాల ప్రదేశాల్లో కోటల్లోని సీన్లు.. అన్నీ విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలమే. క్రిష్‌ సృజనాత్మకతకు.. టెక్నికల్ పంచ్ ప్లస్ బాలయ్య ఇమేజ్ తొడైతే.. అదిగో రిజల్ట్ అదిరిపోయింది. దానితో అందరికీ రాజమౌళి తరువాత ఇలాంటి ఎపిక్ సినిమాలను హ్యాండిల్ చేయాలంటే.. ఇక ఇండియాలో క్రిష్‌ ఒక్కడే అనే భావన రాక మానదు.

అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అదరగొట్టేయడంతో పాటు.. కావల్సిన చోట సీన్లను డ్రమటైజ్ చేయడం.. తన స్టార్ క్యాస్ట్ దగ్గర నుండి ఓ రేంజులో నటన రాబట్టుకోవడం.. అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్ డిజైన్ చేయించుకోవడం.. మాంచి సంగీతాన్ని సమకూర్చుకోవడం.. ఇలా అన్ని విభాగాల్లోనూ క్రిష్‌ ఔరా అనిపించేశాడు. సాహో శాతకర్ణి అన్నవారంతా ఇన్ డైరెక్టుగా సాహో క్రిష్‌ అంటున్నట్లే. రాజమౌళికి పోటీగా మనోడు జెండా పాతేసినట్లే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/