Begin typing your search above and press return to search.
క్రిష్.. పూరి ఆశలకు గండి కొడుతున్నాడా?
By: Tupaki Desk | 16 Jan 2017 11:00 PM IST‘బాబు బంగారం’ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గురు’ మొదలుపెట్టేసి చకచకా పూర్తి చేసేశాడు విక్టరీ వెంకటేష్. ఇది కంప్లీట్ అయ్యేలోపే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమా కోసం సన్నాహాలు జరిగిపోయాయి. ఓ దశలో ఈ సినిమాపై సందేహాలు నెలకొన్నప్పటికీ.. ఈ సినిమా యధావిధిగా షూటింగ్ జరుపుకుంటుందని నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయని.. ఈ సినిమా త్వరలోనే మొదలు కావచ్చని అంటున్నారు. వెంకీ 74వ సినిమా ఇదే కావచ్చేమో. ఐతే 75వ సినిమా గురించే ఇప్పుడు సస్పెన్స్ నడుస్తోంది.
సడెన్ గా పూరి జగన్నాథ్ లైన్లోకి వచ్చి వెంకీకి ఓ కథ చెప్పడం.. రూ.45 కోట్ల భారీ బడ్జెట్ అడగడం.. స్వయంగా వెంకీనే సగానికి పైగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అవడం.. గురించి గత రెండు మూడు వారాల్లో వార్తలు వచ్చాయి. ఐతే లేటెస్టుగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో విమర్శకుల ప్రశంసలందుకుని.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన క్రిష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను వెంకీ 75వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు చెప్పడంతో అందరి దృష్టీ అటు మళ్లింది. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీని పూరి చేతికి వెంకీ అప్పగించేశాడని.. అందుకే బడ్జెట్ విషయంలో కూడా ముందు వెనుక ఆలోచించట్లేదని అంతా అనుకుంటుండగా.. ఇప్పుడు క్రిష్ 75వ సినిమా అని క్లియర్ గా చెప్పి తనే దాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. అదో సోషియో ఫాంటసీ మూవీ అని కూడా స్పష్టత ఇచ్చాడు. మరి పూరి సినిమా సంగతేంటి? మధ్యలో కథ అడ్డం తిరిగి వెంకీ అతడికి నో చెప్పేశాడా..? లేక కిషోర్ తిరుమల ప్రాజెక్టు ను పక్కనబెట్టి పూరితో సినిమా చేసి.. ఆ తర్వాత క్రిష్ తో 75వ సినిమా చేస్తాడా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/