Begin typing your search above and press return to search.

క్రిష్ కు కేవీ రెడ్డి డబుల్ ధమాకా

By:  Tupaki Desk   |   5 May 2018 2:02 PM GMT
క్రిష్ కు కేవీ రెడ్డి డబుల్ ధమాకా
X
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో ప్రతిభావంతులు చాలామంది ఉన్నా.. జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తమ కెరీర్ మొత్తంలో క్రిష్ తో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలు కూడా కోరుకుంటారు. అలాంటి డైరెక్టర్ కి.. ఇప్పుడు ఒకేసారి రెండు అద్భుతాలు జరిగాయని చెప్పచ్చు.

కేవీ రెడ్డి.. ఈయన గురించి తెలుగు సినిమా జనాలకు ఎక్కువ పరిచయం అవసరం లేదు. పాండవులే లేని భారతంగా మాయాబజార్ ను తీసి.. చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు ఆయన. వచ్చే బుధవారం రిలీజ్ కు రెడీ అయిన మహానటి చిత్రంలో క్రిష్ ఓ కీలక పాత్ర పోషించాడు. అది వేరే ఏదో కాదు.. దర్శకుడి కేవీ రెడ్డి పాత్రే కావడం చెప్పుకోవాల్సిన విషయం. దిగ్గజ దర్శకుడి పాత్రలో తను నటించడం అంటే.. తనకు దక్కిన ఓ అదృష్టం అంటున్నాడు క్రిష్. ఈ పాత్రకు సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేసి.. కేవీ రెడ్డిగా క్రిష్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

అచ్చు గుద్దినట్లుగా కేవీ రెడ్డి గెటప్ లో క్రిష్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. గతేడాది కేవీ రెడ్డితోనే క్రిష్ కు ముడిపడిన ఓ సంఘటన జరిగింది. 017 సంవత్సరానికి గాను.. ప్రతిష్టాత్మక కేవీ రెడ్డి అవార్డును క్రిష్ అందుకున్నాడు. గతేడాది కేవీ రెడ్డి అవార్డును అందుకున్న తాను.. ఆ వెంటనే మహానటి చిత్రంలో కేవీ రెడ్డిగానే నటించే అద్భుతమైన అవకాశం ఇచ్చిన మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి