Begin typing your search above and press return to search.

అవార్డ్ సొమ్మంతా దానమిచ్చిన క్రిష్‌

By:  Tupaki Desk   |   4 May 2016 5:00 PM IST
అవార్డ్ సొమ్మంతా దానమిచ్చిన క్రిష్‌
X
కొంతమంది ప్రతిభతో గుర్తింపు పొందుతారు, మరికొంత మంచితనంతో మంచి పేరు సంపాదిస్తారు. ఈ రెండు ఒకచోటకు చేరడం చాలా తక్కువసార్లే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఒక టాలీవుడ్ దర్శకుడి సొంతం. ప్రతిభావంతుడు, విభిన్న చిత్రాల దర్శకుడు అని గుర్తింపు పొందిన క్రిష్.. ఇప్పుడు తన సహృదయతను ప్రదర్శించాడు.

తాజాగా జాతీయ చలనచిత్ర అవార్జుల ఫంక్షన్ లో కంచె సినిమాకి గాను.. క్రిష్ కు ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కింది. జాతీయ అవార్డ్ అంటే దాంతోపాటే పెద్ద మొత్తంలో రివార్డ్ మనీ కూడా ఉంటుంది. కానీ ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించేశాడు క్రిష్. 'నాకు జాతీయ అవార్డు ప్రైజ్ మనీ రూపంలో వచ్చిన సొమ్మును.. మా అమ్మతో పాటు ఎంతో మందికి అద్భుతమైన కేన్సర్ చికిత్స అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా ఇస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు క్రిష్.

క్రిష్ సినిమాలే మనసును తట్టి లేపేలా ఉంటాయి. ఆఫ్ స్క్రీన్ లో కూడా తను ఎంత మంచి వ్యక్తో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. ప్రస్తుతం బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర షూటింగ్ కు రెడీ అవుతున్నాడు క్రిష్. ఈ మూవీకి గాను ఈ నెల 9నుంచి మొరాకోలో యుద్ధ సన్నివేశాల పిక్చరైజేషన్ చేయనున్నారు.