Begin typing your search above and press return to search.

80 అనుకుంటే.. బాలయ్య 79 రోజుల్లోనే

By:  Tupaki Desk   |   22 Nov 2016 1:00 PM IST
80 అనుకుంటే.. బాలయ్య 79 రోజుల్లోనే
X
ఇప్పుడు దర్శకుడు క్రిష్‌ ఒక సూపర్ స్టార్ లా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మనోడు వర్క్ చేస్తున్న తీరు అందరినీ అబ్బురపరుస్తోంది. అయితే అతగాడికి మన నందమూరి నటసింహం సహకరిస్తున్న తీరు అంతకంటే కిక్ యాస్ అనే చెప్పాలి. ఇంతకీ ఈ ఇద్దరూ కలసి ఏం చేశారో తెలుసా!!

నిజానికి ''గౌతమీపుత్ర శాతకర్ణి'' వంటి విజువల్ ఎఫెక్ట్స్ సమ్మేళితమైన చారిత్రాత్మక సినిమాను తీయాలంటే పెద్ద కత్తిమీద సాము అనే చెప్పాలి. కాని క్రిష్‌ మాత్రం బాలకృష్ణ 100వ చిత్రాన్ని చాలా కత్తిలాగే తెరకెక్కించాడు. ఎందుకంటే మనోళ్ళు 80 రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తి చేసేయాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే అంత తక్కువ సమయంలో అసలు పూర్తి చేస్తాడా అనే సందేహం వచ్చింది. పైగా బాలయ్య వంటి సీనియర్ స్టార్ అంటే.. వారు చెప్పిన టైములో షూటింగ్ చేయాలి.. కావల్సినప్పుడు షూటింగ్ కాల్ ఆఫ్‌ చేయాలి అనే టాక్ ఉండనే ఉంది. మరి క్రిష్‌ చేస్తాడా? అంటే.. చేసి చూపించేశాడు.

80 రోజుల్లో కాదు.. ఏకంగా బాలయ్య అందించిన సహకారానికి మనోడు 79 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేశాడట. బాలయ్య అందించిన అలాంటి ఎమేజింగ్ సహకారం కారణంగా ఇప్పుడు సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్లాన్ చేసినట్లే అద్భుతంగా వస్తున్నాయి అంటున్నారు. ఒకవేళ గ్రాఫిక్స్ పని పూర్తయిపోతే సినిమా జనవరి 12నే వస్తుంది.. లేకపోతే మాత్రం వాయిదాపడే ఛాన్సుంది. ఏదేమైనా క్రిష్‌ అండ్ బాలయ్య రాకింగ్ అంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/