Begin typing your search above and press return to search.

కంగ‌న‌తో `మణి‌క‌ర్ణిక` వివాదంపై క్రిష్ అలా అన్నారా?

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:30 AM GMT
కంగ‌న‌తో `మణి‌క‌ర్ణిక` వివాదంపై క్రిష్ అలా అన్నారా?
X
`మణికర్ణిక: ఝాన్సీరాణి` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో కంగ‌న‌తో ద‌ర్శ‌కుడు క్రిష్ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిన‌దే. ఆ సినిమా మెజారిటీ భాగం తెర‌కెక్కించి ఎడిటింగ్ ప్రాసెస్ లో ఉన్న‌ప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ అనూహ్యంగా త‌ప్పుకున్నారు. దాంతో పెండింగ్ షూట్ ని పూర్తి చేసేందుకు కంగ‌న తానే ద‌ర్శ‌కురాలి అవ‌తారం ఎత్తింది.

తాజాగా నాటి వివాదంపై `సామ్ జామ్` కార్య‌క్ర‌మంలో క్రిష్‌ స్పందించారు. ``నేను చివరిసారిగా మాట్లాడాలనుకుంటున్నాను. కంగన ఆమె బృందం ఈ చిత్రాన్ని చూసాక రెండు రోజుల తరువాత నాకు కాల్ వచ్చింది. నా ఏకైక భయం ఏమిటంటే నేను స్టోరీ టెల్ల‌ర్ గా ప్రపంచానికి తెలియకుండా పోతాన‌నేదే. కళాకారులుగా మన సామర్థ్యాన్ని మాత్రమే చూపించగలం. మనకు సరైన అవకాశాలు వచ్చినప్పుడు ప్రపంచానికి చూపించ‌గ‌లం” అని క్రిష్ అన్నారు.

నిజానికి క్రిష్ తెర‌కెక్కించిన మూవీలో కొన్ని స‌న్నివేశాల‌ను కంగ‌న త‌న‌కు న‌చ్చిన‌ట్టు రీషూట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వ్వ‌డం క్రిష్ కి న‌చ్చ‌లేద‌న్న ప్ర‌చారం సాగింది. మణికర్ణిక 2019 లో విడుదలై ప్రేక్షకులు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది.