Begin typing your search above and press return to search.

పుడమి + పుస్తకం = అతను

By:  Tupaki Desk   |   10 Nov 2015 10:08 AM IST
పుడమి + పుస్తకం = అతను
X
మట్టిని - మనిషిని నమ్ముకున్నవాడెప్పటికైనా విజయం సాధిస్తాడన్న మాట వాస్తవం. అప్పటివరకూ రోత సినిమాల మోతతో సతమతమవుతున్న తెలుగు సినిమా ప్రేక్షకులకు తన మార్కు భావోద్వేగమైన, ఆలోచనా పూర్వక కమర్షియల్ సినిమాలతో కొత్త ఊపిరిని పోసిన దర్శకుడు జాగర్లమూడి రాధా కృష్ణ.

ఎవరి కెరీర్ అయినా గమ్యాన్ని చేరుకోవడానికే. అయితే క్రిష్ ప్రయాణమే గమ్యంతో మొదలైంది. తనని తానూ తెలుసుకునే పాత్రని సినిమాలో కధకు ఇమిడ్చిన తీరు సాహసోపేతం. 5 విభిన్న కమర్షియల్ స్టోరీలను కలిపి వేదం వంటి మెసేజ్ ఓరియెంటెడ్ అవుట్ పుట్ తీసుకురావడం అతనికే సాధ్యం. కృష్ణం వందే జగద్గురం అయితే నిజంగా తెలుగు సినీ ప్రేక్షకుడు గర్వంగా చెప్పుకోవలిసిన చిత్రం. మట్టికి మనిషికి వున్న సంబంధం.. అనుబంధం కళాత్మకంగా ఆవిష్కరించిన తీరు అసామాన్యం.

తాజాగా కంచె సినిమాతో మన కమర్షియల్ చిత్రాలకున్న హద్దులను చెరిపే ప్రయత్నం చేసిన క్రిష్ పుడమికి, పుస్తకానికి ఎంతో రుణపడి వుంటానని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాడు. మనం కూడా క్రిష్ కి, అతని సినిమాలకు ఎప్పటికీ రుణపడి వుంటాం. ఎందుకంటే క్రిష్ సినిమాలో జీవితం వుంటుంది.. ఎక్కడైనా జీవితం క్రిష్ సినిమాలానే వుంటుంది..