Begin typing your search above and press return to search.
క్రిష్ ఖబడ్దార్ కి వివరణ
By: Tupaki Desk | 28 Dec 2016 10:16 AM ISTఅత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన బాలయ్య నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్ లో దర్శకుడు క్రిష్ చెప్పిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ స్పీచ్ చివర్లో ఇచ్చిన ఖబడ్దార్ వార్నింగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. అసలు క్రిష్ ఈ వార్నింగ్ ఎవరికిచ్చాడంటూ రచ్చ మొదలైంది.
ఈలోపు కొందరు ఔత్సాహికులు ఇది మెగా 150 మూవీకి ఇచ్చిన వార్నింగ్ అని తేల్చేశారు. తమ సినిమాతో పోటీకి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చిందని విశ్లేషించారు. అంతేకాక ఖైదీ నెంబర్ 150 టీజర్లో ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ని తమకి రిలేట్ చేసుకుని ఇది దానికి కౌంటర్ అంటూ బటర్ ఫ్లై ఎఫెక్ట్ టెక్నీక్ వాడారు.
ఇందులో ఏమాత్రం నిజం వుందో తెలీదుగానీ వెంటనే క్రిష్ స్పందించడం విశేషం. తనకు బన్నీ - వరుణ్ తో మంచి బాండింగ్ వుందని, చరణ్ తో ఎప్పట్నుంచో స్నేహం వుందని, తన ప్రతీ ఎదుగుదలలో మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంవుందని, మెగా ఫామిలీకి ఆ డైలాగ్ కి ఏ మాత్రం సంబంధంలేదని, తెలుగు జాతి చరిత్రని మరిచిపోయిన తెలుగువాళ్ళకు సవాల్ అని స్పష్టంచేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/