Begin typing your search above and press return to search.

జక్కన్నని దాటే స్థాయి క్రిష్ దేనా?

By:  Tupaki Desk   |   19 Dec 2016 5:00 PM IST
జక్కన్నని దాటే స్థాయి క్రిష్ దేనా?
X
టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అనగానే దర్శక ధీరుడు రాజమౌళి పేరు వినిపించడం ఖాయం. మొదట్లో మాస్ ఎంటర్టెయినర్స్ తనదైన స్టైల్ లో తెరకెక్కించిన రాజమౌళి.. అక్కడి నుంచి రూట్ మార్చి విజువల్ ఎఫెక్ట్స్ లోకి వచ్చేశాడు. మగధీరతో టాలీవుడ్ బాక్సాఫీస్ లు అన్నీ బద్దలు కొట్టేసి.. ఆ తర్వాత ఈగతో సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు బాహుబలి సిరీస్ తో అయితే.. ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా చేరాడు.

కానీ జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ సంగతి వేరు. మొదటి నుంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ని తీస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటన్నాడు. కంచె మూవీని రెండో ప్రపంచయుద్ధంతో ఓ పల్లెటూరి ప్రేమకథకు లింక్ చేసి చిత్రీకరించిన తీరు అసామాన్యం. ఇందులో కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయ్ కానీ.. అవేమీ కథను డామినేట్ చేయవు. ఇప్పుడు బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి క్రిష్.. అద్భుతమైన ట్రైలర్ ను రిలీజ్ చేశాడు.

విజువల్ ఎఫెక్ట్స్ అంటే రాజమౌళి అని మారిపోయిన ఈ రోజుల్లో.. శాతకర్ణి ట్రైలర్ తో క్రిష్‌ జక్కన్నని మించిపోయాడని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్లు.. ఏళ్లకేళ్ల సమయం తీసుకోకుండా నెలల వ్యవధిలోనే అద్భుతమైన చిత్రాన్ని అందిచబోతున్నాడు క్రిష్. శాతకర్ణి కనుక కమర్షియల్ సక్సెస్ సాధిస్తే.. విజువల్ ఎఫెక్ట్స్ ని బేస్ చేసుకుని కథ నడిపించిన రాజమౌళి కంటే.. కథలో భాగంగా గ్రాఫిక్స్ ని ఉపయోగించుకున్న క్రిష్ కి ఎక్కువ మార్కులు పడతాయనడంలో సందేహం అక్కర్లేదు.

ఇది ప్రూవ్ అవడానికి ఒకే ఒక అడ్డంకి.. శాతకర్ణి సక్సెస్. ఇప్పుడున్న బజ్ ప్రకారం అదేమీ కష్టం కాదనే అనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/