Begin typing your search above and press return to search.

క్రిష్-4 ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   11 Nov 2019 8:30 PM GMT
క్రిష్-4 ముహూర్తం ఫిక్స్
X
క్రిష్ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఇప్ప‌టికే ఈ ఫ్రాంఛైజీ నుంచి మూడు భారీ చిత్రాలు వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌ వ‌ర్షం కురిపించాయి. పార్ట్ -3 కాస్త నిరుత్సాహప‌రిచినా క్రిష్‌ బ్రాండ్ కి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు. ఇక హృతిక్ రోష‌న్ పెర్ఫామెన్స్ కి ఎదురే లేదు. క్రిష్ సినిమాల‌తో అత‌డు ఇండియ‌న్ సూప‌ర్ హీరోగా ఆవిర్భ‌వించాడు. ఈ జాన‌ర్ సినిమాల్లో హృతిక్‌ ని కొట్టే వేరొక‌ హీరో లేనేలేడ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. హృతిక్ న‌ట‌న‌తో పాటు.. రాకేష్ రోష‌న్ మేకింగ్ స్టైల్.. రాజేష్ రోష‌న్ సంగీతం ఆ ఫ్రాంఛైజీని త‌ర్వాతి లెవ‌ల్లో నిల‌బెట్టాయి. అందుకే క్రిష్ ఫ్రాంఛైజీ అంటే మార్కెట్లో ఓ బ్రాండ్. కేవ‌లం బాలీవుడ్ లో మాత్ర‌మే కాదు.. తెలుగులోనూ క్రిష్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క్రిష్‌-4 రాక కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. రాకేష్ రోష‌న్ చాలా కాలంగా దీనిపై క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్లు పూర్తి క్లారిటీ లేదు. ఎట్ట‌కేల‌కు నాలుగో సినిమాకి రంగం సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఫ్యాన్స్ కి కొత్త సంవ‌త్స‌ర కానుక‌ను ఇవ్వ‌బోతున్నార‌ట‌. 2020 జ‌న‌వరిలో క్రిష్-4 ని లాంచ్ చేయ‌డానికి హుమూర్తం ఫిక్స్ చేసారు.

ఇప్ప‌టికే స్క్రిప్ట్ సిద్ద‌మైంది. క్రిష్-3లో దొర్లిన త‌ప్పుల‌ను రిపీట్ కాకుండా స్క్రిప్ట్ ద‌శ‌లోనే జాగ్ర‌త్త ప‌డిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం రాకేష్ రోష‌న్ త‌న టెక్నిక‌ల్ టీమ్ తో క‌లిసి లోకేష‌న్ల వేట‌లో ప‌డ్డార‌ట‌. ఇప్ప‌టికే ఇండియా స‌హా విదేశాల్లోనూ ఎగ్జోటిక్ లోకేష‌న్ల‌ను ఎంపిక చేసారట‌. లొకేష‌న్ల‌ను ఫైన‌ల్ చేసి షూటింగ్ ప్రారంభించ‌డ‌మే ఆల‌స్య‌మ‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. క్రిష్ సినిమాల‌కు లొకేష‌న్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటాయి. ఆ విష‌యంలో రాకేష్ రోష‌న్ ఎక్క‌డా రాజీ ప‌డ‌రు. ఈసారి కూడా అంద‌మైన లొకేష‌న్లే వెతుకుతున్నారట‌.

అవ‌స‌రం మేర‌ స్టూడియోల్లో షూటింగ్ తో పాటు భారీ సెట్స్ లోనూ తెర‌కెక్కిస్తారు. అలాగే ఒరిజిన‌ల్ లోకేష‌న్స్ లో మెజారిటీ చిత్రీక‌ర‌ణను చేస్తార‌ట‌. ముఖ్యంగా విజువ‌ల్ గ్రాఫిక్స్ .. అలాగే టెక్నికాలిటీస్ ప‌రంగా క్రిష్ -3 పై కొన్ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో పార్ట్-4 విష‌యంలో అలా జ‌ర‌గ‌కుండా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్ట‌డానికి ఇంకా 50 రోజులే స‌మ‌యం ఉంది. ఈ లోపు క్రిష్‌-4 పై మ‌రింత అప్ డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. నిర్మాత‌ రాకేష్ రోష‌న్ పాత టెక్నిక‌ల్ టీమ్ తోనే మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్న‌ట్లు స‌మాచారం. సూప‌ర్ 30 .. వార్ లాంటి చిత్రాల‌తో భారీ హిట్లు అందుకున్న హృతిక్ త‌దుప‌రి ఫ‌రాఖాన్.. భ‌న్సాలీ లాంటి టాప్ డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేయ‌నున్నారని వార్త‌లు వ‌చ్చాయి. ఈలోగానే క్రిష్ 4 ప్రారంభ‌మ‌వుతోంద‌న్న వార్త అభిమానుల్లో ఉత్సాహం మ‌రింత పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు.