Begin typing your search above and press return to search.

ఆ డైరక్టర్ తో అర్జున్ రెడ్డి సినిమా

By:  Tupaki Desk   |   25 Oct 2017 6:02 AM GMT
ఆ డైరక్టర్ తో అర్జున్ రెడ్డి సినిమా
X
పెళ్లి చూపులు సినిమాతో సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు విజయ్ సాయి దేవరకొండ. ఒక్క సినిమా ఇచ్చిన ఎనర్జీతో తన నెక్స్ట్ సినిమాను ఏ లెవెల్ కి తీసుకెళ్లాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో లెవెల్ లో తన మార్కెట్ రేంజ్ ని పెంచుకున్నాడు ఈ యువ హీరో. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ హీరో కి మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి.

కానీ విజయ్ మాత్రం తొందరపడకుండా తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఒక సినిమాలో డిఫరెంట్ రోలు చేస్తున్నాడు. అలాగే రాహుల్ అనే మరో యువ దర్శకుడి తెరకెక్కిస్తోన్న ప్రయోగాత్మకమైన సినిమాతో కూడా చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మరోకొత్త కథను ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఓనమాలు - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఒక సినిమాను చేయనున్నాడట. మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఆ సినిమా ఉంటుందట. వచ్చే ఏడాది విజయ్ విజయ్ దేవరకొండ ఆ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇక సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్ రామారావు ఆ సినిమాను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో క్రాంతి మాధవ్ తీసిన ఉంగరాల రాంబాబు సినిమా పరిస్థితి అటూ ఇటూ తిరిగి కాస్త ఘోరంగా మారిపోయినా.. విజయ్ మాత్రం ఆ దర్శకుడితో సినిమా చేయాలని బలంగా డిసైడ్ ఈ కథను ఓకే చేసుకున్నాడట. అది సంగతి.