Begin typing your search above and press return to search.

సెన్సిబుల్ క‌థ‌తో పెళ్లి చూపులు హీరో!

By:  Tupaki Desk   |   28 Dec 2016 8:02 AM GMT
సెన్సిబుల్ క‌థ‌తో పెళ్లి చూపులు హీరో!
X
పెళ్లి చూపులు సినిమాతో ఫ‌స్ట్ హిట్ కొట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తొలి చిత్రంతోనే సెన్సిబుల్ హీరోగా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందాడు. తొలి సినిమా సూప‌ర్ హిట్ అయినాస‌రే తొంద‌ర‌ప‌డ‌టం లేదు. ఆచితూచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటున్నాడు. త‌న ఇమేజ్ కు స‌రిప‌డే క‌థ‌ల్ని ఏరికోరి ఎన్నుకుంటున్నాడు. తాజాగా ఓ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ గా పేరున్న క్రాంతి మాధ‌వ్ తో సినిమా క‌మిట్ అయ్యాడు.

ఓన‌మాలు... మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల ద్వారా సున్నిత‌మైన క‌థాంశాల‌ను చ‌క్క‌గా డీల్ చేయ‌గ‌ల‌డ‌ని నిరూపించాడు క్రాంతి మాధ‌వ్‌. ఇప్పుడు మూడో ప్ర‌య‌త్నంగా సునీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం టైటిల్‌... ఉంగ‌రాల రాంబాబు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ చిత్రం చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌. రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ తో ‘మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు’ను నిర్మించింది కూడా ఈయ‌నే. ఈ ప్రాజెక్టులూ ఇత‌ర న‌టులూ సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లి చూపులు హిట్ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస‌గా ఆరు చిత్రాలు క‌మిట్ అయ్యాడ‌ట‌! ఒక్క హిట్ జీవితాన్ని మార్చేయ‌డం అంటే ఇదే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/