Begin typing your search above and press return to search.

సునీల్ ఇంకో సినిమా ప‌ట్టేశాడు

By:  Tupaki Desk   |   23 March 2016 1:30 PM GMT
సునీల్ ఇంకో సినిమా ప‌ట్టేశాడు
X
ఎప్పుడో ‘పూల‌రంగ‌డు సినిమాతో ఓ హిట్టు కొట్టాడు క‌మెడియ‌న్ ట‌ర్న్డ్ హీరో సునీల్. ఆ త‌ర్వాత అతను హీరోగా తెర‌కెక్కిన మిస్ట‌ర్ పెళ్లికొడుకు - భీమ‌వ‌రం బుల్లోడు పెద్ద డిజాస్ట‌ర్ల‌య్యాయి. తాజాగా ‘కృష్ణాష్ట‌మితో మ‌రో చేదు గుళిక తిన్నాడు. ఐతే త‌న సినిమాల ఫ‌లితాలెలా ఉన్నా సునీల్ కు హీరోగా అవ‌కాశాలు మాత్రం ఆగ‌డం లేదు.ఇప్ప‌టికే ఈడు గోల్డ్ ఎహె - జ‌క్క‌న్న సినిమాలు చేస్తున్న సునీల్.. లేటెస్టుగా ఇంకో మంచి అవ‌కాశం ప‌ట్టేశాడు

ఓన‌మాలు - మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ త‌న త‌ర్వాతి సినిమా చేయ‌బోతున్నాడు. యునైటెడ్ మూవీస్ అధినేత ప‌రుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ఇందులో హీరోయిన్, టెక్నీషియ‌న్ల వివ‌రాలు త‌ర్వాత వెల్ల‌డిస్తారు. ఈ సినిమా చేస్తున్న విష‌యాన్ని సునీలే స్వ‌యంగా ట్విట్ట‌ర్లో వెల్ల‌డించాడు.

‘మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు త‌ర్వాత కొంద‌రు ప్ర‌ముఖ హీరోల క‌ళ్లు క్రాంతి మాధ‌వ్ పై ప‌డ్డాయి. విక్ట‌రీ వెంక‌టేష్ అత‌డితో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపించాడు. వెంకీ కోసం క్రాంతి మాధ‌వ్ ఓ క‌థ కూడా రెడీ చేశాడు. ఐతే ఎందుకోగానీ ఆ ప్రాజెక్టు ఓకే కాలేదు. త‌ర్వాత నాగార్జున పేరు కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఐతే చివ‌కి సునీల్ తో ఫిక్పయ్యాడు క్రాంతిమాధ‌వ్‌.