Begin typing your search above and press return to search.

క్రాక్ టీజ‌ర్: మాస్ రాజాకు విజిలేయాలంతే

By:  Tupaki Desk   |   21 Feb 2020 4:13 PM GMT
క్రాక్ టీజ‌ర్: మాస్ రాజాకు విజిలేయాలంతే
X
మంచి ఎన‌ర్జీ ఉన్న క్యారెక్ట‌ర్ త‌గిలితే రాజాలో ఉన్న ఎన‌ర్జీ ఆటోమెటిగ్గా బ‌య‌ట‌ప‌డిపోతుంది. ఆ త‌ర్వాత రాజాలోని మాస్ ని ఆప‌లేం. ఇదిగో స‌రిగ్గా అలాంటి క‌థ‌- క్యారెక్ట‌ర్ తోనే ఈసారి గోపిచంద్ మ‌లినేని స‌రిగ్గా ర‌వితేజ‌ను చూపించ‌బోతున్నాడ‌ని క్రాక్ టీజ‌ర్ చెబుతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్ లో రూపొందుతోన్న క్రాక్ నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. డాన్‌ శీను- బ‌లుపు లాంటి సినిమాల తర్వాత ఆ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో ఇందులోనూ మాంచి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయ‌ని అంతా అంచ‌నా వేసారు.

అందుకు త‌గ్గ‌ట్టే మాస్ మ‌హారాజా ర‌వితేజ పోలీస్ పాత్ర‌లో చెల‌రేగి పోయాడు. శివరాత్రి సంద‌ర్భం గా రిలీజైన‌ క్రాక్ టీజర్ ర‌వితేజ ఫ్యాన్స్ కి గుడ్ ట్రీట్ అనే చెప్పాలి. రాజా ఎన‌ర్జీ.. కొల‌త‌ల‌కు త‌గ్గ‌ట్టు టీజ‌ర్ ని ప‌ర్ఫెక్ట్ గా తీర్చిదిద్దారు గోపిచంద్ మ‌లినేని. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. ఒంగోల్ లో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ తోనే మ్యాట‌రేంటో అర్థ‌మై పోతోంది.

ఒరేయ్ అప్పిగా.. తుప్పిగా.. నువ్వు ఎవరైతే నాకేంట్రా నా టొప్పిగా.. అంటూ మాస్ రాజా త‌న‌దైన శైలి డైలాగ్ తో చెల‌రేగిపోయాడు. ముఖ్యంగా ర‌వితేజపై మ‌ర్డ‌ర్ ఎటెంప్ట్ చేసిన ఆ ఒక్క సీన్ అదిరిపోయింది. అలాగే థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తిగా కొత్త మూడ్ లోకి తీసుకెళ్లింది. ఈ మూవీకి తమిళ సినిమా సేతుపతి స్ఫూర్తి అని తెలుస్తోంది. టీజ‌ర్ తోనే క్రాక్ చూపించాడు. ట్రైల‌ర్ తో ఇంకేం చూపిస్తాడో. ఇక థియేట‌ర్ల‌లో మాస్ మ‌టాషే అన‌డంలో సందేహం లేదు. మే 8న ఈ సినిమా విడుదల కానుంది.