Begin typing your search above and press return to search.

'క్రాక్' నుంచి మ్యాజికల్ మెలోడీ 'కొరమీసం పోలీసోడా'..!

By:  Tupaki Desk   |   24 Dec 2020 3:09 PM GMT
క్రాక్ నుంచి మ్యాజికల్ మెలోడీ కొరమీసం పోలీసోడా..!
X
మాస్ మహారాజా రవితేజ - శృతి హాసన్ జంటగా నటిస్తున్న 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో రవితేజ పవర్‌ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'క్రాక్' ప్రచార చిత్రాలు మరియు 'భూమ్ బ‌ద్ద‌ల్' 'భలేగా తగిలావే బంగారం' సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న మరో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్. థమన్ స్వరపరిచిన 'కొరమీసం పోలీసోడా' అనే మ్యాజికల్ మెలోడీ సాంగ్ ని రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు 'క్రాక్' టీమ్ ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రవిజేత మీసాన్ని శృతి హాసన్ తన కాలితో మెలేస్తూ రొమాంటిక్ మూడ్ లో కనిపిస్తున్నారు. కాగా, ‘డాన్ శీను’ ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని - రవితేజ కలయికలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని - వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.