Begin typing your search above and press return to search.

పర్సనల్స్ పట్టించుకోను -కోట

By:  Tupaki Desk   |   9 Oct 2016 3:30 PM GMT
పర్సనల్స్ పట్టించుకోను -కోట
X
కోట శ్రీనివాసరావు.. గత పాతికేళ్లుగా తెలుగు తెరపై నట వైవిధ్యానికి మరో పేరు ఈయన. అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించడమే కాదు.. ప్రతీ పాత్రకు తగినట్లుగా తెలుగులోని ఆయా యాసలు మాండలికాల్లో మాట్లాడగలిగి మెప్పించే అరుదైన నటుల్లో ఆయన ఒకరు. అంతగా భాషపై ఆయనకు పట్టు ఉంటుంది.

కానీ తన ప్రయాణంలో పిల్లల చదువుల సంగతి కూడా పట్టించుకునే తీరిక ఉండేది కానీ.. వాళ్లే అర్ధం చేసుకుని మంచి చదువులు చదువుకున్నారని చెబుతున్నారు కోట. ఇక పేరుకు తగ్గట్లుగానే తన కీర్తి ప్రతిష్టలతో కోట కూడా కట్టేసిన కోట శ్రీనివాససరావుకు.. నిజ జీవితంలో మాత్రం ఆయన కుటుంబకోటకు చాలాసార్లే బీటలు వారాయి. యాక్సిడెంట్ కారణంగా కూతురు కాలు తీసేసిన పరిస్థితి.. దాన్నుంచి కోలుకుని ఒడ్డున పడే సమయానికి కొడుకు దూరం కావడం.. భార్య అనారోగ్యం.. ఇలా ఒకదాని వెంట మరొకటి కోటను వెంటాడాయి. అయితే.. వీటి గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే.

'నా పెళ్లైన కొన్నాళ్లకే మా ఆవిడకు జబ్బు చేసింది. అయితే.. నేను కుటుంబ విషయాలు ఎవరికీ చెప్పేవాడిని కాదు.. అలాగే వారి పర్సనల్ విషయాలు అడిగేవాడిని కూడా కాదు. ఎన్ని కష్టాలనైనా మనసులోనే పెట్టేసుకోవడం నాకు అలవాటయిపోయింది' అంటున్నారు కోట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/