Begin typing your search above and press return to search.

గ్యారేజ్ యవ్వారంపై కోట షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   15 Sept 2016 6:11 PM IST
గ్యారేజ్ యవ్వారంపై కోట షాకింగ్ కామెంట్స్
X
తెలుగు నటీనటులను తొక్కేసి ఇతర బాషల నుండి అనవసరంగా జనాలను దించుతున్నారు అంటూ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు ఎప్పటినుండో మొత్తుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన బాక్సాఫీస్ సెన్సేషన్ 'జనతా గ్యారేజ్'లో నటించిన మోహన్ లాల్ పేరు చెబుతూ ఆయన సంచలన కామెంట్లు చేశారు.

''మొన్నీమధ్యన ఒక సినిమా రిలీజైంది. ఇంతవరకు హీరో గురించి ఎవరూ చెప్పడం వినలేదు. ఆ సినిమాలో మోహన్ లాల్ బాగా వేశాడు. అతను గ్రేట్ మలయాళం యాక్టర్. కాని అతన్ని పెట్టుకుని నువ్వు సినిమా చేసి.. బాగా చేశాడు అంటే ఎలా? మరి తెలుగువాడు ఏమైపోయాడు? అది చూపించాక తెలుగువాడు ఎంత యాక్ట్ చేస్తే నీకు ఆనతాడు?'' అంటూ ప్రశ్నించారు కోట. ''పనైపోతుంది కదా వాళ్ళని పెట్టుకుంటే.. మిగిలనవారు భోజనం చేయక్కర్లేదా??'' అంటూ సూటిగా ప్రశ్నించారు ఆయన.

ఇకపోతే గతంలో మనమంతా సినిమా రిలీజప్పుడైతేనేంటి.. ఇప్పుడు జనతా గ్యారేజ్ రిలీజ్ అప్పుడైతే ఏంటి.. డైరక్టర్లు ఏమంటున్నారంటే.. 'అసలు ఆ రేంజ్ యాక్టింగ్ ఇక్కడ చేసేవారు లేకపోవడంతోనే మేం పరాయి బాష నుండి నటులను అరువు తెచ్చుకుంటున్నాం' అంటూ సెలవిచ్చారు. వీరు ఇప్పుడు కోట కామెంట్స్ పై ఏమని స్పందిస్తారో చూడాలి.